ఆంధ్రప్రదేశ్‌

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 23: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర వైపు కదులుతోంది. దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్నిచోట్ల కుండపోత వర్షాలు పడతాయన్నారు. తీరం వెంబడి తూర్పు దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తీవ్ర అల్పపీడన ప్రభావంతో బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల బుధవారం రోజంతా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.