ఆంధ్రప్రదేశ్‌

ఉపాధి బిల్లుల కోసం ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఓ పక్క కేంద్రప్రభుత్వం ఉపాధి హామీ పథకం బిల్లులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్రప్రభుత్వం తమ వాటాను కలిపి విడుదల చేయకపోవడం దారుణమని, బిల్లులు మంజూరయ్యే వరకు ఉద్యమం సాగిస్తామని, ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
చేసిన పనులకు నిధులు విడుదలయ్యే వరకు తెలుగుదేశం అండగా నిలుస్తుందని, ఎవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని హితవుపలికారు. కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల అధ్యక్షులతో బుధవారం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్‌టీర్ భవన్‌లో జరిపిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు బిల్లులు అందక పోవడంతో ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారని, దీనికి వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. సమస్యలపై ధైర్యంగా పోరాడాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదని భరోసానిచ్చారు. గ్రామాల అభివృద్ధి కోసం అభిమానం, చిత్తశుద్ధితో ఉపాధి హామీ పనులు నిర్వహించారని, అయితే చేసిన పనులకు చెల్లింపులు చేయాలని అడుగుతుంటే వైసీపీ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
సొంత పొలంలో మట్టి తీసుకెళ్లాలన్నా జగన్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మనం తవ్విన పంటకుంటలు జలకళతో నిండుగా దర్శనమిస్తుండటమే సత్ఫలితాలకు నిదర్శనమని, గత ఏడాది రూ.9,300 కోట్ల విలువైన పనులు నిర్వహించామన్నారు. తమ పాలనలో ఉపాధి హామీ పథకం కింద 32 వేల కోట్ల రూపాయల విలువైన పనులు నిర్వహించి నిధులను సద్వినియోగం చేసుకున్నామన్నారు.
ఉపాధి నిధుల విడుదల కోసం ఉద్యమ కార్యాచరణను రూపకల్పన చేశామని, ఈ నెల 24వ తేదీ నుండి నవంబర్ 3వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో మండల పరిషత్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 4 నుండి 17వ తేదీ వరకు 13 రోజుల పాటు జిల్లా కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు, అనంతరం ఛలో అమరావతి, ఛలో ఢిల్లీ ఆందోళనలు చేపట్టనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు