ఆంధ్రప్రదేశ్‌

గాంధీ సంకల్పయాత్రలకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల రూరల్, అక్టోబర్ 23: గాంధీజీ కలలు గన్న భారతదేశాన్ని నిర్మించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కడప జిల్లా పులివెందులలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గాంధీజీ ఆశయాన్ని నేరవేర్చే దిశగా భాజపా అడుగు వేస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అందుకు అనుగుణంగా పనిచేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా గాంధీ సంకల్పయాత్రలకు శ్రీకారం చుట్టారన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో గాంధీజీ సంకల్పయాత్రలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో అక్టోబర్ 17 నుంచి ఈ యాత్రలు కొనసాగుతున్నాయన్నారు. అందులో భాగంగానే పులివెందులలో బుధవారం గాంధీజీ సంకల్పయాత్ర చేపట్టామన్నారు. కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రి మోదీ గాంధీజీ కలలుగన్న స్వచ్ఛ భారత్‌లో భాగంగా పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన, పక్కాగృహాలు వంటి సంక్షేమ పథకాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారన్నారు. కాశ్మీర్‌కు సంబంధించి 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా అక్కడి ప్రజలకు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ప్రతి అంశం వర్తిస్తుందని చాటిచెప్పారన్నారు. ప్రధానమంత్రి మంచి ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ కార్యక్రమాలకు ప్రజలు అండగా నిలవాలన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు శశిభూషణ్‌రెడ్డి, వెంకటేష్‌యాదవ్, యువమోర్చ జాతీయ కార్యదర్శి సురేష్, కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి రామచంద్రారెడ్డి, యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... పులివెందులలో విలేఖరులతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ