ఆంధ్రప్రదేశ్‌

ఇంకా తెలియని రమ్యశ్రీ ఆచూకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 23: గోదావరిలో మునిగిపోయిన బోటును ఎట్టకేలకు బయటకు తీసుకొచ్చినా, గల్లంతైన వారిలో తెలంగాణకు చెందిన ట్రాన్స్‌కో ఏఈ కారుకూరి రమ్యశ్రీ (25) ఆచూకీ ఇంకా తెలియరాలేదు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గత నెల 15వ తేదీన గోదావరిలో మునిగిపోయిన ప్రైవేటు పర్యాటక బోటును మంగళవారం మధ్యాహ్నం వెలికితీసిన సంగతి విదితమే. బయటకు తీసుకొచ్చిన బోటులో ఏడు మృతదేహాలున్నట్టు అధికారులు ప్రకటించారు. అయితే అధికారిక లెక్కల ప్రకారం ఇంకా ఐదుగురి ఆచూకీ తెలియరాలేదు. బోటు వెలికితీస్తే ఏదో రూపంలో తమ వారి ఆచూకీ తెలుస్తుందని భావించిన బాధిత కుటుంబాల్లో ఐదుగురి ఆచూకీ లేదన్న సమాచారం మరింత విషాదాన్ని నింపింది. మరోపక్క బోటు లభించిన ఏడు మృతదేహాలు బాగా పాడై, ఎముకల రూపంలో ఉండటంతో సరిపోల్చి బంధువులకు అప్పగించే కార్యక్రమం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో బుధవారం చేపట్టారు. మృతదేహాలను గుర్తించడానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి బంధువులు రాజమహేంద్రవరం ఆసుపత్రికి చేరుకున్నారు. ఇందులో ఒక మృతదేహాన్ని జేబులోని పర్స్ ఆధారంగా గుర్తించారు. ఎముకల గుట్టగా ఉన్న బోటు సహాయకుడు మణికంఠ మృతదేహాన్ని ఫ్యాంటు ఆధారంగా గుర్తించారు. మరో రెండు మృతదేహాలను మొలతాడు, వాచీ ఆధారంగా గుర్తించారు. వెలికితీసిన బోటు నుంచి సేకరించిన మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా పాడై ఉండటంతో వాటిని అత్యంత జాగ్రత్తగా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలియాల్సిన వారిలో రమ్యశ్రీతో పాటు, వరంగల్‌కు చెందిన కొండూరి రాజ్‌కుమార్, విశాఖ జిల్లాకు చెందిన దారకొండ అఖిలేష్ (6), తలారి ధాత్రి అనన్య(6), తలారి గీతా వైష్ణవి (4) ఉన్నారు.