ఆంధ్రప్రదేశ్‌

కాల్వలు ఇక కళకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 23: కాలుష్య కేంద్రాలుగా మారుతున్న కృష్ణా, గోదావరి కాలువల ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కాలువల ప్రక్షాళన, సుందరీకరణ, చెట్ల పెంపకంపై కృష్ణా, గోదావరి కెనాల్స్ మిషన్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా విజయవాడలోని కృష్ణా కాలువను 4 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. కృష్ణా, గోదావరి కాలువల్లో రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పాదయాత్రలో నదుల కాలువల్లోని నీరు కలుషితం అవడాన్ని చూసి, కాలుష్య నియంత్రణకు దృష్టి పెట్టానని తెలిపారు. భూగర్భ జలాలు సైతం కలుషితం కావడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయన్నారు. దీనిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. కాలుష్య నియంత్రణకు పని చేస్తున్న వివిధ సంస్థలతో కలిసి నివారణ చర్యలు చేపట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో చర్చించారు. మురుగునీటిని శుద్ధి చేశాకే కాలువల్లోకి విడిచిపెట్టాలని అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా కృష్ణా, గోదావరి కాలువల్లో బాగు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించాలన్నారు. ఎక్కడెక్కడ మరుగుశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలో గుర్తించాలన్నారు. కాలువల సుందరీకరణ,
చెట్ల పెంపకంపై కార్యాచరణ రూపొందించాలన్నారు. ఇందులో భాగంగా గోదావరి, కృష్ణా కెనాల్స్ మిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ మిషన్స్ కార్యకలాపాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని ప్రకటించారు. మిషన్ చైర్మన్‌గా ముఖ్యమంత్రి, వైస్ చైర్మన్‌గా గండిపేట వెల్ఫేర్ అసోసియేషన్‌కు చెందిన రాజశ్రీ వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా కాలుష్య నివారణా చర్యలు విస్తృతంగా చేపట్టిన ఆ అసోసియేషన్ ప్రతినిధులను ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. అనంతరం వారు కేరళలో చేపట్టిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను వివరించారు. ఆదే తరహాలో కృష్ణా, గోదావరి కాలువల శుద్ధి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రయోగాత్మకంగా విజయవాడలోని నాలుగు కిలోమీటర్ల మేర కృష్ణా కాలువను అభివృద్ధి చేయాలని కోరారు.

*చిత్రం... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి