ఆంధ్రప్రదేశ్‌

పక్కాగా ఒక్క భవనాన్నీ కట్టలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం : ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం చేపడతామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మంత్రి బొత్స మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన కాలంలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనం నిర్మించకుండా, అన్ని తాత్కాలిక భవనాలనే ఎందుకు నిర్మించిందని చంద్రబాబును ప్రశ్నించారు. కేవలం తన వ్యక్తిగత ఆరాధన కోసం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి నేడు చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారన్నారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్ పేరిట చంద్రబాబు తన బంధువులు, నేతలు వేలాది ఎకరాల రాజధాని భూములను దోచుకున్నది నిజం కాదా? చంద్రబాబు, లోకేష్ బాధ ప్రస్తుతం వారి వియ్యంకులు, బంధువులకు కేటాయించిన భూముల కోసమేనన్నారు. చంద్రబాబుకు రాజధాని విషయంలో ఎన్నిసార్లు క్లారిటీ ఇవ్వాలి? క్లారిటీ లేనిది తండ్రి, కొడుకులకే.. మాకు కాదు.. అంటూ బొత్స విమర్శించారు. అమరావతి అందరిదని, ఒక్క సామాజిక వర్గానికి చెందినది కాదన్నారు. 13 జిల్లాలను ప్రజలు కోరుకున్నట్లుగా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే నిపుణుల కమిటీ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి, రాజధాని విషయంలో ప్రజల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తుందన్నారు. నిపుణుల కమిటీకి ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేమన్నారు. గతంలో శివరామకృష్ణ నివేదికను, సిఫార్సులనూ పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
జగన్‌ను ఏకవచనంతో మాట్లాడటం సరికాదు
రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఏకవచనంతో సంబోధించడం సరికాదని, కేవలం కడుపుమంటతోనే బాబు ఈ విధంగా మాట్లాడుతున్నారని మంత్రి బొత్స అన్నారు. మూడుసార్లు సీఎంగా, ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు ఈ విధంగా మాట్లాడటం, మీ వయస్సుకు గౌరవం తగ్గించుకున్నట్లేనని, గౌరవంగా
మాట్లాడటం నేర్చుకోవాలన్నారు. చంద్రబాబుని ప్రజలు తిరస్కరించారని, బాబు ఆలోచనలన్నీ మోసం, దగానేన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను జగన్ నేరవేరుస్తున్నారని, వ్యవస్థలను చక్కదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామని, ఐదు కోట్ల మంది ప్రజలు ఆమోదించే రాజధానినే నిర్మిస్తామన్నారు
పవన్ కళ్యాణ్‌కు మైండ్ సరిగ్గా లేదు
సీఎం జగన్ సీబీఐ కోర్టు కేసుల విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి బొత్స ఖండించారు. పవన్ కళ్యాణ్‌కు మైండ్ సరిగ్గాలేదని, అందుకే అనాలోచితంగా మాట్లాడుతున్నారని, మేము కేంద్రంతో ఏ విషయంలో లాలూచీ పడలేదన్నారు. ఏ కేసులు గురించి కేంద్రంతో జగన్ కలిశారో పవనే చెప్పాలన్నారు. ఈ సమావేశంలో విఎం ఆర్‌డీఏఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు.

*చిత్రం... రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ