ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధిని వికేంద్రీకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ప్రాంతీయ అసమానతలు లేకుండా వికేంద్రీకరణతో అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలోని మీడియా సెల్‌లో బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇటీవల ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు అర్థరహితమని ఖండించారు. నీతి ఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ పేరిట దేశవ్యాప్తంగా సర్వేచేస్తే ఆ వివరాలను పూర్తిగా తెలుసుకోకుండా రాష్ట్రం 10వ స్థానానికి పడిపోయిందని, అప్పటి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు నిర్వహిస్తే వాటిని మూసేసి మద్యం షాపులను తెరుస్తోందని వాటితో మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని ఆరోపించారు. గత మూడు నెలలుగా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. పూర్తి స్థాయిలో చక్కదిద్దాలంటే మరికొంత సమయం పడుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పింఛన్ మొత్తాన్ని రూ. 2250కు పెంచిందని, నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించామని, వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు ఆర్థిక సహాయం
అందుతోందని వివరించారు. జనవరిలో అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో చెలరేగిన ఇసుక మాఫియాకు తమ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందన్నారు. వర్షాల కారణంగా నదుల్లో ఇసుక తవ్వకాలకు అంతరాయం ఏర్పడుతోందని రెండు నెలల్లో ఇసుక సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో పరిశ్రమలకు ఇవ్వాలని బడ్జెట్‌లో ప్రతిపాదించిన రాయితీలు ఇంతవరకు మంజూరు చేయలేదన్నారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తం కంటే 2014-15లో రూ. 2వేల కోట్లు, 2015-16లో రూ. 26 కోట్లు, 2016-17లో 290 కోట్లు, 2018-19లో 740 కోట్లు తక్కువగా రాయితీలు చెల్లించారని, విద్యుత్ కొనుగోలుకు సంబంధించి డిస్కంలకు పెద్దఎత్తున బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన వివిధ సూచికల్లో దేశం మొత్తంగా మన రాష్ట్రం ఒక్కోదానిలో ఒక్కో ర్యాంకులో ఉందని చెప్తూ ఆకలి రహిత (జీరో హంగర్) సూచికలో జాతీయ స్థాయిలో 17వ ర్యాంక్‌లో ఉందన్నారు. అందుకే పేదలకు చౌకధరల దుకాణాల ద్వారా బ్యాగ్‌లలో మెరుగైన బియ్యాన్ని తమ ప్రభుత్వం పంపిణీ చేస్తోందని చెప్పారు. మంచినీరు, పారిశుద్ధ్యం అంశాల్లో 16వ ర్యాంక్‌లో ఉన్నామని, వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇండస్ట్రీ అండ్ ఇన్నోవేషన్ సూచికలో 20వ ర్యాంక్‌లో ఉన్నామని, ఆర్థిక అసమానతలలో 14వ స్థానానికి చేరామని వివరించారు. ఈ కారణంగానే 13 జిల్లాల సమాన అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనేదే తమ ప్రభుత్వం ముందున్న ప్రధాన కర్తవ్యమన్నారు.

*చిత్రం... ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి