ఆంధ్రప్రదేశ్‌

భూ కుంభకోణంపై 1 నుంచి సిట్ దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 23: విశాఖలో చోటుచేసుకున్న భూ కుంభకోణాలు, రికార్డుల తారుమారు తదితర అక్రమాలపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నవంబర్ 1వ తేదీ నుంచి విచారణ ప్రారంభిస్తుందని సిట్‌కు నాయకత్వం వహిస్తున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ విజయ్‌కుమార్ వెల్లడించారు. విశాఖ కలెక్టరేట్‌లో జిల్లా యంత్రాంగంతో బుధవారం సమావేశమై అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకూ అందరి నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. అనంతరం 8,9తేదీల్లో ప్రజలతోపాటు అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. గత ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు నివేదిక తమకు ఇటీవలే అందిందని, దాన్ని కూడా పూర్తిగా పరిశీలించి, విషయాలు తెలుసుకుంటామన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు అన్ని విషయాల్లోనూ తమ బృందం దర్యాప్తు చేస్తుందని, మూడు నెలల కాల వ్యవధిలోనే నివేదిక ప్రభుత్వానికి ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. తమ బృందం జరిగిన అక్రమాలు, అవకతవకలపై విచారణ చేసి, చర్యలకు సిఫారసు చేస్తుందన్నారు. తాము నేరుగా ఎవరినీ అరెస్టులు చేయడం, విధుల నుంచి తప్పించడం వంటి ఆదేశాలు ఇవ్వమన్నారు. విశాఖలో భూములు కొనుగోలు చేసి, ప్రస్తుతం వేరే ప్రాంతాలతోపాటు విదేశాల్లో ఉంటున్న వారు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. సిట్‌కు ఫిర్యాదు చేసేందుకు ఒక ఫార్మాట్ సిద్ధం చేస్తున్నామని, ఏ వివరాలు పొందుపరచాలి, ఎటువంటి డాక్యుమెంట్‌లు జతపరచాలన్నది స్పష్టంగా తెలిపేలా ఈ ఫార్మాట్ ఉంటుందన్నారు. ఆన్‌లైన్ ఫిర్యాదులకు కూడా ఇదే ఫార్మాట్ ఉంటుందన్నారు. అధికారులు, రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం ఉంటే పిలిపిస్తామన్నారు. మరో సభ్యురాలు, విశ్రాంత ఐఏఎస్ అధికారి వైవీ అనురాధతోపాటు జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, జేసీ శివశంకర్, నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా పాల్గొన్నారు.
*చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న సిట్ అధిపతి విజయ్‌కుమార్