ఆంధ్రప్రదేశ్‌

పంచారామాలు, త్రిలింగ దర్శన భాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 24: కార్తీకమాసంలో ఒకే రోజులో వేరువేరుగా పంచారామాలు, త్రిలింగ దర్శన దర్శన భాగ్యం కల్పిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. పవిత్ర మాసంలో ఒకే రోజు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పుణ్య క్షేత్రాలను భక్తులు దర్శించుకునేలా సంస్థ ఎండీ మొవ్వ తిరుమల కృష్ణ బాబు ఏర్పాట్లు చేశారు. ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం అలాగే ముఖ్యమైన రోజుల్లో ప్రత్యేక సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు విజయవాడ ఆటోనగర్ బస్ టెర్మినల్ నుంచి తెల్లవారుజాము ఉదయం మూడు గంటలకు అలాగే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ఉదయం నాలుగు గంటలకు బయలుదేరి తిరిగి అదే రోజు రాత్రి విజయవాడకు చేరుతాయి. ఇదిలా ఉండగా ఏపీఎస్ ఆర్టీసీ కార్తీకమాసంలో త్రిలింగ దర్శనం కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహిస్తోంది. యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామి, మహానంది, శ్రీశైలం మల్లకార్జునస్వామి ఆలయాల సందర్శన కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ మూడు క్షేత్రాల సందర్శన నిమిత్తం ఆర్టీసీ శనివారం రాత్రి 8 గంటలకు బయలుదేరి తిరిగి సోమవారం ఉదయం విజయవాడకు చేరేలా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద సూపర్ లగ్జరీ టిక్కెట్ రూ. 1430, పిల్లలకు రూ. 1080లను రేటుగా నిర్ణయించారు. పై తేదీల్లో కాకుండా 36 నుంచి 40 మంది గ్రూపుగా కోరిన తేదీలో ప్రత్యేక బస్సును నడుపుతారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి పంచారామాల బస్సు చార్జీలు సూపర్ లగ్జరీ రూ. 880, పిల్లలకు రూ. 630లు, అల్ట్రా డీలక్స్ పెద్దలకు రూ. 840, పిల్లలకు రూ. 630 చార్జీలుగా నిర్ణయించామని ఆర్టీసీ కృష్ణా రీజియన్ మేనేజర్ నాగేంద్రప్రసాద్ తెలిపారు.