ఆంధ్రప్రదేశ్‌

వేలివెన్నులో సనాతనం.. సప్త దేవతా కళ్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 28: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నవంబర్ 1 నుండి 3వ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవారం మండలం వేలివెన్ను గ్రామంలో ఉమాసోమేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి వార్ల దేవస్థానంలో ‘సనాతనం - సప్త దేవతా కళ్యాణం’ పేరిట ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి తురగా నాగభూషణం తెలిపారు. ఈ కార్యక్రమానికి భారతదేశంలో ప్రముఖ క్షేత్రాల పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, ప్రముఖ గాయకులు హాజరవుతారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రైతులు పాడి పంటలతో, విద్యార్థులు చదువుల్లో అత్యున్నత స్థాయికి వెళ్లాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. సప్త దేవతలకు కళ్యాణం చేయటం ద్వారా జగత్తుకు మంచి జరగాలని ఈ కార్యక్రమం చేస్తున్నట్లు నాగభూషణం తెలిపారు. ఈ కార్యక్రమానికి క్షేత్రస్థాయి పర్యవేక్షకులుగా ప్రసాద్ శర్మ, యాగ సంరక్షకులుగా నందిగం భాస్కర రామయ్య తదితరులు వ్యవహరిస్తారని వివరించారు.