ఆంధ్రప్రదేశ్‌

రాజధానిలో ఇనాం భూముల వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 6: రాజధానిలో ఇనాం భూముల వివాదం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ల్యాండ్ పూలింగ్‌లో వివిధరకాల భూములను ప్రభుత్వం సమీకరించింది. వీటిని జరీబు, మెట్ట, అసైన్డు, అటవీ, ఇనాం, లంక భూములుగా వర్గీకరించి నష్టపరిహారం కౌలు చెల్లింపులు జరుపుతోంది. 1956 రైత్వారీ చట్టం కింద కౌలుదార్లు, హక్కుదార్లకు 1/3, 2/3 వంతున భూములు కేటాయించారు. ఇందులో భాగంగానే మల్కాపురంలో 28 మంది రైతుల నుంచి 39 ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వం సమీకరించింది. అయితే 16ఎకరాల మేర హక్కుదార్లకు సంబంధించిన భూమిలో కూడా పూలింగ్‌కు ముందు కౌలుదార్లు సేద్యం చేస్తున్నారు. కాగా ఇనాం అప్పిలేటు అబాలిషన్ చట్టం ప్రకారం ఈ భూమికి అధికారులు కౌలు చెల్లింపు నిలిపివేశారు. దీనిపై హక్కులను నియంత్రించారు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు కౌలు చెల్లింపు జరపాలని లేకపోతే సేద్యం చేసుకుంటామని మంగళవారం పొలాల్లో దిగారు. కోర్టు పరిధిలో ఉన్నందున సాగు చేయరాదని సీఆర్డీయే అధికారులు రైతుల్ని కోరారు. ప్రభుత్వం ఇనాం భూములకు సంబంధించి పూర్తి స్పష్టత ఇచ్చేంత వరకు సాగుని నిలిపివేసేదిలేదని, తమకు రెండో ఏడాది కౌలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఇనాం వారసులకు కేటాయించిన 1/3 వంతు వాటాకు సంబంధించి కూడా గతంలో అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాలను కౌలుదార్లకు మంజూరు చేయటంతో వివాదం చెలరేగింది. దీంతో ఇనాందార్లకు సంబంధించిన భూములకు అధికారులు కౌలు నిలిపివేసినట్లు సీఆర్డీయే అధికారులు తెలిపారు.

చిత్రం.. ఇనాం భూముల్లో సాగు ప్రారంభించిన రైతులు