ఆంధ్రప్రదేశ్‌

కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాల, సెప్టెంబర్ 6: చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. సోమవారం చవితి పర్వదినాన ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఏటా వినాయకచవితి మరుసటిరోజు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం ధ్వజారోహణం నిర్వహించారు. 21 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో సిద్ధి బుద్ధి సమేతుడైన వినాయకస్వామిని రోజూ ఒక వాహనంపై కాణిపాకం పురవీధుల్లో ఊరేగించనున్నారు. ఈ ధ్వజారోహణం కార్యక్రమం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయం తరపున ఇఒ భ్రమరాంబ, చైర్మన్ గురవయ్యనాయుడులు స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధ్వజారోహణ కార్యక్రమంలో ఇఒ పూర్ణచంద్రరావు, ఎసి వెంకటేష్, ఎఇఒ కేశవరావు, అలయ ప్రధాన అర్చకులు, వేదపండితులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వినాయక స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంగళవారం మేళతాళాల మధ్య పట్టువస్త్రాలు తీసుకువచ్చి ఆలయ ప్రధాన అర్చకులకు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాకార మండపంలో జరిగిన వినాయక వ్రతంలో ఆయన పాల్గొన్నారు. సిద్దిబుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవ మూర్తులను అంగరంగ వైభవంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు.
హంస వాహనంపై ఊరేగిన విఘ్నేశ్వరుడు
కాణిపాకం వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి పార్వతీ తనయుడు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రప్రథమంగా స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.

చిత్రం.. కాణిపాకం ఆలయంలో ధ్వజారోహణం నిర్వహిస్తున్న దృశ్యం