ఆంధ్రప్రదేశ్‌

భూమనను ప్రశ్నించిన సిఐడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 6: తూర్పుగోదావరి జిల్లా తుని రైలుదగ్ధం.. అల్లర్ల ఘటనలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని సిఐడి అధికారులు గుంటూరులో విచారిస్తున్నారు. కేసుకు సంబంధించి ప్రభుత్వం సేకరించిన ఆధారాలలో భూమన కాల్‌డాటా ఆధారంగా సిఐడి విచారణ చేపట్టింది. ఈనెల నాలుగోతేదీన గుంటూరు లేదా రాజమండ్రిలో విచారణకు హాజరు కావాల్సిందిగా సిఐడి నోటీసులు జారీచేసింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తాను హాజరుకాలేనని వివరణ ఇచ్చారు. దీంతో మంగళవారం గుంటూరు సిఐడి కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా సిఐడి నుంచి వర్తమానం అందింది. ఈ మేరకు రాజమండ్రి సిఐడి ఎఎస్‌పి హరికృష్ణ నేతృత్వంలో అధికారులు గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారణ ప్రారంభించారు. కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పోలీసు అధికారులు భూమనను ప్రత్యేకంగా విచారించారు. ముద్రగడతో తుని బహిరంగసభకు ముందు జరిగిన టెలిఫోన్ సంభాషణలపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా భూమనతో పాటు వైసిపి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ముస్త్ఫా పార్టీనేత అంబటి రాంబాబు, జిల్లా నాయకులు సిఐడి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విచారణ జరుగుతున్నందున ఎమ్మెల్యేలు కార్యాలయం వద్ద ఉండేందుకు వీల్లేదని పోలీసులు హుకుం జారీచేశారు. దీంతో వైసిపి ఎమ్మెల్యేలు, సిఐడి అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం సేకరించిన వీడియో టేపులు, కాల్‌డాటాలకు సంబంధించి సిఐడి ఏఎస్‌పి హరికృష్ణ నేతృత్వంలోని ప్రత్యేక బృందం భూమనను ప్రశ్నించారు. బుధవారం కూడా విచారణ కొనసాగనుంది. ఈ సందర్భంగా భూమన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఈ కేసులో కావాలనే తనను ప్రభుత్వం ఇరికించిందని ఆరోపించారు. తుని అల్లర్లతో సంబంధంలేని తనపై అక్రమ విచారణ జరపటం చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గంలో భాగమన్నారు. ఉక్కుపాదంతో ఉద్యమాలను అణచివేయాలని సిఎం ప్రయత్నించటం అవివేకమన్నారు. కాపులను బిసీలలో చేర్చుతామని ప్రభుత్వమే హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీ నెరవేర్చనందునే ఆందోళన నిర్వహించారని, ప్రభుత్వమే అల్లర్లను ప్రేరేపించిందని ఆరోపించారు. మద్దతిచ్చినందుకు తమను నిందితులుగా అనుమానిస్తూ విచారణ జరపటం అమానుషమన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. చెవిరెడ్డి
ప్రభుత్వం ప్రతిపక్షాలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అణచివేత చర్యలకు పాల్పడుతోందని తమపై అక్రమ కేసులు బనాయించడంతో పాటు వేధింపులకు దిగుతున్న వైనంపై ఈనెల 8వ తేదీన జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హెచ్చరించారు. గత 30 ఏళ్లుగా ముద్రగడతో భూమనకు పరిచయం ఉందని, రిజర్వేషన్ ఉద్యమానికి సంఘీభావం తెలిపినందుకే వైసిపి నేతలను టార్గెట్ చేస్తున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి మండిపడ్డారు. పోలీసులు తమను రోడ్డుపై కూడా ఉండనిచ్చే పరిస్థితులులేవని ఇలాంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తిలేదన్నారు. విచారణ పేరుతో భూమన కరుణాకరరెడ్డికి ఎలాంటి హాని తలపెట్టినా ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

చిత్రం.. తొలిరోజు విచారణ అనంతరం సిఐడి ఆఫీసు వద్ద
మీడియాతో మాట్లాడుతున్న భూమన కరుణాకర్‌రెడ్డి