ఆంధ్రప్రదేశ్‌

స్విస్‌చాలెంజ్‌పై స్టే ఇస్తే జాతి ప్రయోజనాలకు ఆటంకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ఆంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి, నిర్మాణానికి ఎంపిక చేసిన స్విస్‌చాలెంజ్ పద్ధతిని సవాలు చేస్తూ దాఖలైన కేసులో పిటిషనర్లు,ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు ముగిశాయని, ఈ నెల 12వ తేదీన తీర్పు ఇవ్వనున్నట్లుహైకోర్టు జడ్జి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ప్రకటించారు. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ, సిఆర్‌డిఏ నోటిఫికేషన్లపై స్టేలు ఇస్తూ పోతే సింగపూర్ కన్సార్టియమ్ వెనక్కువెళ్లే అవకాశాలున్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో వ్యతిరేకంగా ఇచ్చే ఉత్తర్వుల వల్ల జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ఏపి ప్రభుత్వం అమరావతిని ప్రపంచంలో ఉన్నత స్ధాయి రాజధాని నగరంగా నిర్మించాలనే తాపత్రయంతో ఉందని, నోటిఫికేషన్‌పై స్టే ఇస్తే విదేశీపెట్టుబడులపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. హైకోర్టు జోక్యం చేసుకుని రెవెన్యూ వాటాల వివరాలు వెల్లడిస్తే వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. అర్హత ఉన్న బిడ్డర్లకు వాటాల విషయం వెల్లడించేందుకు అభ్యంతరాలు లేవని, కాని అర్హతలేని బిడ్డర్లకు తెలియజేయలేమన్నారు.