ఆంధ్రప్రదేశ్‌

తాత్కాలిక సచివాలయానికి 143.67 కోట్ల ఖర్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం కోసం ఇంతవరకు రూ. 143.67 కోట్లు ఖర్చయినట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు.
జీవో 94, జీవో 50 ప్రకారం ఇంజనీరింగ్ ప్రొక్యూర్ మెంట్ కన్‌స్ట్రక్షన్ వ్యవస్థ మార్గదర్శకాల ప్రకారం తాత్కాలిక సచివాలయ నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానించినట్లుచెప్పారు.
సఖినేటి పల్లి మండలం అంతర్వేది వద్ద డ్రెడ్జింగ్ కార్పోరేషన్ హార్బర్‌ను మంజూరు చేసే విషయమై కేంద్రం పరిశీలిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
రాష్ట్రంలో ఖాయిలాపడిన పరిశ్రమల పునరుద్ధరణకు వంద కోట్లతో నిధిని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. 13 జిల్లాల్లో దాదాపు 72 పరిశ్రమలు ఖాయిలా పడ్డాయన్నారు. వాణిజ్యపన్నుల బకాయిలు, ఇంధన చార్జీల మినహాయింపు, వడ్డీ రీ ఎంబర్స్‌మెంట్ తదితర విధానాలతో ఈ సంస్ధలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 723 మంది మరణించారని ఉపముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు.
మచిలీపట్నం ఓడరేవుకు 12,144 ఎకరాల 86 సెంట్ల విస్తీర్ణాన్ని సేకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.