ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచ స్థాయిలో ఆంగ్లం తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 8: తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మాతృభాషను ఎన్నటికీ మరవబోమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆంగ్లభాష నైపుణ్యాలను విద్యార్థులకు అందించడం ద్వారా వారు ప్రపంచ స్థాయిలో పోటీని తట్టుకునే విధంగా తీర్దిదిద్దాలనేదే ప్రభుత్వ సంకల్పమన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ బోధన ప్రవేశపెడుతున్నట్లు మంత్రి పునరుద్ఘాటించారు. విద్యారంగ సంస్కరణలలో భాగంగా 1 నుంచి 5వ తరగతి వరకు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా పాఠ్యాంశాలను మార్పు చేయటం, ఆంగ్లంలో విద్యార్థులకు బోధన అందించి సార్వత్రిక అవసరాలకు దీటైన నైపుణ్యాలను పెంపొందించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. ఆంగ్లంలో బోధనకు సంబంధించి 98వేల మంది ఉపాధ్యాయులు అవసరమని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులకు వచ్చే జనవరి నుంచి మే నెల వరకు వివిధ దశల్లో ఆంగ్లంలో శిక్షణ అందిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఇఫ్లూ (ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ) సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఆంగ్లంలో శిక్షణ ఇచ్చే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. ఆంగ్లం సార్వత్రిక భాష కావడంతో ఆ భాషా నైపుణ్యాలను విద్యార్థులలో పెంపొందించటంతో పాటు అన్ని అంశాలను ఆంగ్ల మాధ్యమంతో పరిచయం చేయటం చారిత్రక అవసరంగా ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అభ్యసించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర విద్యార్థులు రాణించేలా తీర్చిదిద్దేందుకు ఆంగ్ల మాద్యమంలో బోధన తప్పనిసరని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఆంగ్లంలో బోధనతో పాటు మాతృభాషకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామన్నారు. మాతృభాషను బోధనలో తప్పనిసరి పాఠ్యాంశంగా చేర్చామన్నారు. విద్యార్థుల నైపుణ్యాలను బోధనా మాధ్యమాల వారీగా సమానంగా పెంపొందించటం సవాల్‌గా మారిందన్నారు. తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. అన్ని సబ్జక్టులు బోధిస్తూనే తెలుగుకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇందుకోసం తెలుగు ఓ సబ్జక్టుగా చేర్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అక్టోబర్ నాటికి 70,90,217 మంది విద్యార్థులు చేరారని అందులో 44,21,529 (62.36 శాతం) ఆంగ్ల మాధ్యమంలోనే విద్యనభ్యసిస్తున్నారని వివరించారు. ఎస్సీల్లో 49.61, ఎస్టీలలో 33.23, బీసీల్లో 62.5, ఓసీల్లో 82.6 శాతం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారని చెప్పారు. పేదలకు దూరంగా ఉన్నత వర్గాల వారికే ఆంగ్ల మాధ్యమం పరిమితమవుతున్నట్లు దీన్నిబట్టి తెలుస్తోందన్నారు. రాష్ట్రంలో దాదాపు 45వేల పాఠశాలల్లో నవంబర్ 14వ తేదీ నుంచి నాడు-నేడు కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లాలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో పాఠశాలల్లో వౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ప్రతి పాఠశాలలో టాయిలెట్లు, ప్రహరీ, తాగునీరు, నీటిపారుదల, ఫర్నిచర్, ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డులు, లైటింగ్, పెయింటింగ్ వంటి 9 రకాల సదుపాయాలు కల్పించటమే లక్ష్యమని వివరించారు.