రాష్ట్రీయం

రాష్ట్భ్రావృద్ధి 20 ఏళ్లు వెనక్కి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 8: రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు జగన్ అందించిన ప్రణాళికల్లేని పాలనతో రాష్ట్భ్రావృద్ధి 20 సంవత్సరాలు వెనెక్కి పోయిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తన సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లలో నెలకొన్న అసంతృప్తిని బుజ్జగించడంతోపాటు, ఎన్నికల అనంతరం ప్రభుత్వం టీడీపీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తోందని వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు మూడు రోజులుగా చేస్తున్న జిల్లా పర్యటన శుక్రవారంతో ముగిసింది. శుక్రవారం ఉదయం నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించిన ఆయన 11 గంటల నుంచి నిరంతరాయంగా చంద్రగిరి, కుప్పం, పూతలపట్టు, జీడీ నెల్లూరు, తిరుపతి నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఆయా నియోజకవర్గంలోని సమస్యలను, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. పలు నియోజకవర్గాల్లో కొరవడిన సమన్వయలోపం, ఆధిపత్య ధోరణితో కార్యకర్తలు ఎదుర్కొన్న సమస్యలపై నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విలేఖరుల సమావేశంలో పాల్గొని రాత్రి 7 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణమయ్యారు. తొలుత చంద్రగిరిలోని మామండూరు వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద మీడియాతో మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధి, ప్రజా సంక్షేమం అందించడంలో జగన్‌కు అవగాహన రాహిత్యం ఆరు నెలల వ్యవధిలోనే తేటతెల్లమైయ్యిందన్నారు. ఇందుకు నిదర్శనం మీడియాపై ఆంక్షలు విధించడం, తెలుగు భాషను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లభాషను బోధించాలని ఏకపక్షంగా నిర్ణయించడమన్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతూ ఇసుకపై ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం తెలుగు భాషకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. జగన్ ఏకంగా తెలుగు భాషను కనుమరుగు చేసే నిర్ణయాలను చేశారన్నారు. తెలుగువారికి మాతృ భాషను దూరం చేస్తున్నారన్నారు. అమెరికాలో ఉన్న తెలుగువారు ఇంట్లో తెలుగుభాషను మాట్లాడుకుని బయటకు వెళ్లినప్పుడు ఆంగ్ల భాషలో మాట్లాడుతూ తమ కార్యకలాపాలను సాగిస్తున్నారన్నారు. ఇలాంటి కీలక నిర్ణయాలు చేసేటప్పుడు ప్రజల మనోభావాలను తెలుసుకోవాలన్న ఆలోచన చేయకపోవడం దారుణమన్నారు. ఇసుకపై ఆంక్షలు విధించడంతో భవన నిర్మాణ కార్మికులతోపాటు ఆ రంగంపై ఆధారపడి ఉన్న అనేక విభాగాలకు సంబంధించిన కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అందుకే భవన నిర్మాణ కార్మికులకు, వాటి అనుబంధ రంగాలకు అండగా ఉండి పోరాడటానికి ఈనెల 14న 11 గంటలపాటు దీక్ష చేయనున్నట్లు చెప్పారు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఈ అగ్రిగోల్డ్ మోసం జరిగిందన్నారు. అటు తరువాత తమ పాలనలో వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయించామన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో హద్దులు దాటితే మంచిది కాదని ఆయన జగన్‌కుహితవు పలికారు. ముఖ్యంగా వెంకన్న ఆలయంలో పింక్ డైమండ్ పోయిందని విజయసాయి రెడ్డి, నాటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారన్నారు. అయితే అలాంటిది లేదని అప్పటి ఈ ఓ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారని దీంతో టీటీడీ వీరిరువురిపైన కేసులు కూడా నమోదు చేసిందన్నారు. ఈక్రమంలో రమణ దీక్షితులను తిరిగి ఆగమ సలహామండలి సభ్యుడిగా జగన్ ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. తిరుమలలో అనేక ఆరోపణలు ఎదుర్కొని వెళ్లిన ధర్మారెడ్డిని తిరిగి అదనపు ఈ ఓగా నియమించడం ఎంత వరకు సబబన్నారు. జిల్లా నాయకత్వం ఈ సమావేశం విజయవంతం చేయడంలో సఫలీకృతం అయ్యిందని వారిని అభినందిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ మాజీ మంత్రి అమరనాథ రెడ్డి, గల్లా అరుణ కుమారి, పనబాక లక్ష్మి, నాయకులు సుగుణమ్మ, శంకర్ రెడ్డి, సూరాసుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డ్వాక్రా సంఘాలను కూడా నిర్వీర్యం చేసే కుట్ర
విజయవాడ(సిటీ): టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన వీఓఏలను తొలగించడం దుర్మార్గమైన చర్య అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు మండిపడ్డారు. తన ముద్ర తొలగించాలనే కక్షతో వీఓఏలను తొలగించడం దుర్మార్గం, అమానుషం అంటూ శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది వీఓఏలను తొలగించడం, వారి స్థానంలో వైకాపా కార్యకర్తలను నియమించాలని చూడటం దుర్మార్గం, అమానుషమన్నారు. తాను ఏర్పాటు చేశాననే అక్కసుతో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేయాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పత్రికలను నిర్వీర్యం చేసే క్రమంలో జారీ చేసిన జీవో నెం 2430పై ఎడిటర్స్ గిల్డ్ స్పందించడం మంచి పరిణామమని బాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.