ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీలో ఐదు బిల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం నాడు మంత్రులు ఐదు బిల్లులను ప్రవేశపెట్టారు. ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం , డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం సవరణ బిల్లులతో పాటు విలువ ఆధారిత పన్ను బిల్లు, ఎక్సైజ్ సవరణ బిల్లును, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యులు పెద్ద పెట్టున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు ఇస్తున్న సమయంలోనే వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తరఫున , ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు , ఉప ముఖ్యమంత్రి కె ఇ కృష్ణమూర్తి తరఫున దేవినేని ఉమామహేశ్వరరావు నాలుగు బిల్లులను, ప్రవేశపెట్టగా ఎక్సైజ్ మంత్రి రవీంద్ర ఒక బిల్లును సభలో ప్రవేశపెట్టారు.