ఆంధ్రప్రదేశ్‌

ఏపీ ప్రాజెక్టులపై శ్రద్ధ చూపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కోరారు. కేంద్ర ఇంధన వనరులు, సహజ వాయువులు, ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు. ఉదయం రాజ్‌భవన్ చేరుకున్న ఆయన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లోనే అల్పాహార విందును స్వీకరించిన కేంద్ర మంత్రి అనంతరం గవర్నర్‌తో పలు అంశాలను చర్చించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ మాట్లాడుతూ విభజన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ పలు విధాలుగా నష్టపోయిందని, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించాలని మంత్రిని కోరారు. దీనిపై ధర్మేంద ప్రధాస్ మాట్లాడుతూ ఓఎస్‌జీసీ కేజీ బేసిస్‌ను సందర్శించాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి కూడా రావాలని హరిచందన్‌ను కోరారు. ఇటీవల గవర్నర్ విశాఖపట్నంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ సంస్థను సందర్శించగా అక్కడడ చేపట్టవల్సిన అభివృద్ధి పనులపై కూడా వీరిరువురి మధ్య లోతైన చర్చ నడిచింది. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్‌భవన్ సంయుక్త కార్యదర్శి అర్జునరావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కృష్ణాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి బీజేపీ వర్గాల నుంచి ఘన స్వాగతం లభించింది.