ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్‌పై చర్చ అంశాన్ని అజెండాలో పెట్టగలరా?: కూన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 8: గౌరవ ప్రదమైన, రాజ్యాంగబద్ధమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఎలాంటి ప్రమాణాలు పాటించాలి, ఎలా హుందాగా వ్యవహరించాలనే విచక్షణ కూడా లేకుండా శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయాలు మాట్లాడటం సరికాదని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మండిపడ్డారు. గుంటూరులో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో స్పీకర్లుగా పనిచేసిన వారెవ్వరూ తమ్మినేని మాదిరిగా ప్రవర్తించలేదనడానికి ఆయన వాడిన భాష, చేస్తున్న పనులే నిదర్శనమన్నారు. అగ్రిగోల్డ్ అంశంపై మాట్లాడుతున్న తమ్మినేనికి నిజంగా ధైర్యం ఉంటే ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించేలా అజెండాలో పెట్టగలరా అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ అంశంపై మాట్లాడానికి తమ అధినేత చంద్రబాబే అవసరం లేదని, తమ్మినేని అవినీతి చరిత్ర తెలిసిన వ్యక్తిగా తాను సరిపోతానని రవికుమార్ తేల్చిచెప్పారు.