ఆంధ్రప్రదేశ్‌

హామీ నిలబెట్టుకున్నారా? కోత పెట్టి పంచారా?: బుద్దా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), నవంబర్ 8: ప్రజాదగా యాత్రలో ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకున్నారని చెప్పడం మరో వింతగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం చంద్రబాబు ప్రభుత్వం 363 కోట్లు విడుదల చేస్తే, అందులో కోత పెట్టి రూ. 264 కోట్లు మాత్రమే ఇచ్చారని శుక్రవారం ట్విట్టర్‌లో బుద్దా పేర్కొన్నారు. విజయవాడ, హైదరాబాద్ హోటల్స్‌లో కూర్కొని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగకుండా కేసులు వేయించిన విషయం మర్చిపోయారా విజయసాయిరెడ్డి అంటూ గుర్తు చేశారు. ఆస్తులు కొనడానికి ముందుకొచ్చిన కంపెనీలను తమరే స్వయంగా బెదిరించిన విషయం గుర్తుకు లేదా అన్నారు. చిత్తశుద్ది ఉంటే ఇచ్చిన హామీ ప్రకారం వారంలో 1150 కోట్లు జగన్‌తో విడుదల చేయించాలని డిమాండ్ చేశారు.