ఆంధ్రప్రదేశ్‌

బాబు డైరెక్షన్‌లో పవన్ యాక్టింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, నవంబర్ 8: టీడీపీ అధినేత చంద్రబాబు దర్శకత్వంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటిస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, స్ర్తి శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్ఫ్టిను చదివి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా కొడిగెనహళ్లిలోని అంధుల పాఠశాలలో శుక్రవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ టీడీపీ దత్తపుత్రిడిలా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇసుక కొరత ఏర్పడితే దానికి కారణం వైసీపీ ప్రభుత్వమని చెప్పి భూతద్దంలో చూపిస్తున్నారన్నారు. రాష్టవ్య్రాప్తంగా రెండు నెలలుగా అకాల వర్షాల వల్ల ఇసుక కొరత ఏర్పడిందని, దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు అని చెప్పడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలో ఎవరు మృతి చెందినా అది ఇసుక కొరత వల్లే అని చెప్పడం టీడీపీ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు మాట్లాడటం, దానికి పవన్ కల్యాణ్ వంత పాడటం చూస్తుంటే బాబు డైరెక్టర్ అయితే పవన్ యాక్టర్‌గా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు తిరస్కరించిన టీడీపీకి పవన్ వంత పాడుతూ తొత్తుగా వ్యవహరిస్తున్నారన్నారు.
కొత్త పాలసీ ద్వారా తక్కువ ధరకే ఇసుక అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రులు తెలిపారు. త్వరలో ఇసుక సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారమవుతుందన్నారు. కాగా పట్టు రీలర్లు, రైతులు ప్రోత్సాహాకాలు అందలేదని సమ్మె చేస్తున్నారన్న ప్రశ్నకు మంత్రులు స్పందిస్తూ ప్రభుత్వం పట్టు రైతులు, రీలర్లను అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి రైతులు, రీలర్లకు అందాల్సిన నిధులు వెంటనే విడుదలయ్యేలా చూస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీ గోరంట్ల మాధవ్, విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్యే తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.