ఆంధ్రప్రదేశ్‌

తప్పులో కాలేసిన టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: హోదా బదులు ప్యాకేజీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించిన వైనం తమను ఆత్మరక్షణలో పడేసినట్టయిందని టిడిపి ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ జరిగే సమయంలో ప్రకటన చేయటం, దానిపై తమ అధినేత అర్ధరాత్రి స్పందించడం వ్యూహాత్మక తప్పిదమన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. తమ నియోజకవర్గాల నుంచి వస్తున్న ప్రతికూల స్పందనతో ఏమి చేయాలో పాలుపోక తల పట్టుకుంటున్నారు. అయితే, ఇప్పటి పరిస్థితి ప్రకారం కేంద్రం ఇచ్చింది తీసుకోవడం తప్ప మరేమీ చేసేదిలేదని, అది కూడా వద్దంటే నష్టపోతామని బాబు సీనియర్లకు వివరణ ఇచ్చారు. గురువారం ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజు లాబీలో ఎమ్మెల్యేల మధ్య రసవత్తర రాజకీయ చర్చ జరిగింది. జైట్లీ చేసిన ప్రకటన రాజకీయంగా తమ పార్టీకి నష్టం కలిగిస్తుందని పలువురు ఎమ్మెల్యేలు అంచనా వేశారు. అసెంబ్లీ సమావేశాలకు కొద్ది గంటల ముందు జైట్లీ ప్రకటన చేసి, వైకాపాకు అస్త్రం అందించినట్టయిందని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. బుధవారం ప్రకటన చేయడం వల్ల, అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షాలకు మైలేజీ ఇచ్చే విధంగా మారాయన్నారు. ‘అంటే కేంద్ర ప్రకటన తర్వాత వైకాపా చేసే దాడిని తమ పార్టీ అసెంబ్లీలో సమర్ధవంతంగా ఎదుర్కొందని మెసేజ్ పంపించేందుకు మా సార్ జైట్లీతో ప్రకటన చేయించి ఉంటారనీ, అదీకాక, ఇప్పుడు కాకపోయినా రేపయినా ఎదుర్కోవాలి కదా అన్న ఆలోచన కూడా ఉండవచ్చ’ని మరో సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమ అధినేత పెద్ద సాహసమే చేశారని కొందరు ఎమ్మెల్యేలు చెప్పారు. మెజారిటీ ఎమ్మెల్యేలు మాత్రం జైట్లీ ప్రకటనపై బాబు రాత్రికి రాత్రి స్పందించడాన్ని తప్పుపడుతున్నారు. ఈ విషయంలో తాము కచ్చితంగా తప్పులో కాలేశామని అంగీకరిస్తున్నారు. బాబుకు ఎవరు సలహాలిస్తున్నారో అర్ధం కావడం లేదని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కాస్తంత ఆవేశపడ్డారు. మరోవైపు తమ పార్టీ నియోజకవర్గ, మండల స్థాయి నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమను అర్ధరాత్రి వరకూ ఫోన్లలో తినేశారని పలువురు ఎమ్మెల్యేలు లాబీ, మీడియా పాయింట్‌లో సహచరులు, మీడియా వద్ద వాపోయారు. ‘ఇప్పుడు జైట్లీ ప్యాకేజీ ప్రకటించాల్సిన పనేంటి? దానిమీద సార్ ఎందుకు మాట్లాడారు? మీరు సార్‌కు చెప్పరా? జైట్లీ ప్యాకేజీని స్వాగతిస్తున్నామని సార్ చెప్పిన తర్వాత ఇక మేం జనంలోకి ఎలా వెళ్లాల’ని అర్ధరాత్రి వరకూ ఫోన్లలో ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే, సర్దిచెప్పలేక నానా తంటాలు పడాల్సి వచ్చిందని చెప్పారు. సభ వాయిదా పడిన తర్వాత ముఖ్యమంత్రి మంత్రులు, సీనియర్లతో భేటీ అయ్యారు. ‘హోదా బదులు దానికి సమానమైన ప్యాకేజీ ఇస్తామంటే తీసుకోవడం మంచిదనుకున్నాం. అదికూడా వద్దంటే అసలు నష్టపోతాం. ఏదీ లేనిదానికంటే ఏదో ఒకటి తీసుకుకోవడం మంచిది కదా? మనం హోదా వద్దని చెప్పలేదు కదా?’అని బాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం.