తెలంగాణ

రసాయన కంపెనీల వల్లే ప్రజారోగ్యానికి హాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, నవంబర్ 10: రసాయన కంపెనీల కుట్రల వల్లే ప్రజా ఆరోగ్యానికి ఆహార పదార్థాలు హానికారకంగా మారాయని ప్రముఖ ఆహార శాస్తవ్రేత్త, కృషిరత్నడాక్టర్ ఖాదర్‌వలీ అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక సాయిగార్డెన్స్‌లో రైతులోకం ఫౌండేషన్, విశ్రాంత ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆహార, ఆరోగ్య రైతు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రెండు రూపాయల కిలోబియ్యం అందించడంలో పెద్ద కుట్ర ఉందని, ఆంధ్రప్రాంత రైతుల బియ్యాన్ని విక్రయించడానికే ఈ పథకాన్ని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యానికి తీవ్రంగా నష్టం కల్గించారని అన్నారు. అప్పటివరకు చిరుధాన్యాల సాగువైపు ఉన్న రైతులు కాలక్రమేణా ప్రాసెసింగ్ యూనిట్లు లేక ఇసురురాయి, రోకళ్లతో వీటిని బియ్యంగా మార్చే ప్రక్రియకు దూరం కావడం ద్వారానే చిరుధాన్యాల సాగు తగ్గిందన్నారు. తదనంతరం పత్తి, మొక్కజొన్న వంటి పంటల వైపు బడా పారిశ్రామికవేత్తలు తాము ఉత్పత్తి చేసే క్రిమిసంహారక మందులను మార్కెటింగ్ చేసుకొని సొమ్ము చేసుకోవడానికి రైతులను వారికి అవసరమైన పంటలను సాగు చేయనీయకుండా పారిశ్రామికవేత్తలకు అవసరమైన పంటల వైపురైతుల దృష్టిని మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యానికి దోహదపడే జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, సాములు వంటి పంటల సాగుచేయకపోవడం, వాటిని మనం ఆహారంగా వినియోగించుకోకపోవడం ద్వారానే మధుమేహం, క్యాన్సర్, బీపీతో పాటు ప్రేగు, గుండె, జీర్ణక్రియకు సంబంధించిన అనేక వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారని అన్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న కార్పొరేట్ ఆస్పత్రుల యజమానులు వచ్చిన షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు శాశ్వతంగా ఉంటాయని చెప్పి తమ స్వార్థం కోసం అనేక రకాల మందులను వారికి అంటగడుతున్నారని, వ్యాపారమే ధ్యేయంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. వీటితోపాటు అనేక రకాల మనకు అందుబాటులో ఉండే ఆకులు, అలములతో రోగాలను నయం చేసుకోవచ్చన్నారు. దీంతోపాటు నేడు ఆస్పత్రులలో న్యూట్రీషియన్ విభాగాన్ని ఏర్పాటు చేసి బాదం మిల్క్, కివీలు, బాదం పలుకులు వంటివి తినాలని సూచిస్తూ న్యూట్రీషియన్ పేరుతో వారికి కొన్ని వందలు వేల రూపాయల విలువచేసే డబ్బాలను అంటగడుతూ మరోరకంగా ప్రజలనుంచి దోచుకుంటున్నారని విమర్శించారు. దీనికంతటికి మనలో ఉన్న బలహీనతలే కారణమన్నారు. రైతులు కూడా ఈ పంటలను సాగు చేయాలని, వీటిని సాయు చేయడం వల్ల వచ్చే లాభాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, రైతులోకం వ్యవస్థాపకులు ఆచార్య రాంకిషన్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రవీణ్‌రావు, శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...నాగర్‌కర్నూల్‌లో అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఖాదర్‌వలీ