ఆంధ్రప్రదేశ్‌

మీ పిల్లలు ఎక్కడ చదివారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో కచ్చితంగా ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టాలన్న కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఎంతటి వారైనప్పటికీ ఘాటైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. వౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా విజయవాడలో జరిగిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో భారత ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లపై ముఖ్యమంత్రి ఘాటైన విమర్శలు చేశారు. పేదవారికి ఇంగ్లీషు మీడియం ఎందుకు.. తెలుగు మీడియం చాలదా అంటూ కొందరు విమర్శిస్తున్నారని ముఖ్యమంత్రి తప్పుబట్టారు. వెంకయ్య నాయుడు, చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ వెంకయ్యా... మీ పిల్లలు ఎక్కడ చదివారు, ఇప్పుడు మనవళ్లు ఎక్కడ చదువుతున్నారు... చంద్రబాబూ మీ కుమారుడు ఎక్కడ చదివాడు... మనవడిని ఎక్కడ చదివిస్తున్నావు అని ప్రశ్నించారు. ఇక పవన్ కళ్యాణ్‌నుద్దేశించి మరింత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పవన్‌కు ముగ్గురు భార్యలు... వారి నలుగురైదుగులు పిల్లలు ఎక్కడ ఏ మాధ్యమంలో చదువుతున్నారని ప్రశ్నించారు. తన 3648 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నానని, ఇంగ్లీషు మీడియంలో చదివించాలన్న తపన ఉన్నా చదివించలేని స్థితిని చూశానన్నారు. మన పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవకపోతే నష్టపోయేది మనం, మన రాష్టమ్రేనని అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సీఎం జగన్ ఇంగ్లీషు మీడియంలో చదవబట్టే అనర్గళంగా మాట్లాడుతున్నారన్నారు. అదే చంద్రబాబు మాట్లాడగలరా అని ప్రశ్నించారు.

*చిత్రం...ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి