ఆంధ్రప్రదేశ్‌

సిట్ పరిధిలో 1,837 ఫిర్యాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 11: విశాఖ భూ కుంభకోణాలపై నిగ్గు తేల్చేందుకు ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడు వరకు నగరంలో ఫిర్యాదులను స్వీకరించింది. వారం రోజుల్లో సిట్ పరిధిలోకి 1,837 ఫిర్యాదులు రాగా నాన్ సిట్ పరిధిలో 597గా నమోదయ్యాయి. వీటన్నింటినీ కంప్యూటరీకరించే కార్యక్రమం పూర్తయ్యింది. ఇక నుంచి దీని పరిధిలోకి రానివాటిని స్వీకరించకూడదని నిర్ణయించింది. ఏడు అంశాలతో కూడిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోనుంది. ఇది తప్పితే మిగిలిన వాటి జోలికి వెళ్ళకుండా నాన్ సిట్ ఫిర్యాదులను జాయింట్ కలెక్టర్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. సిట్ పరిధిలోకి వచ్చే 13 మండలాలకు సంబంధించి మండలాలవారీగా విభజించాలని సిట్ నిర్ణయించింది. ఈ విధంగా సిట్ పరిధిలో ఉన్న వాటిని ప్రత్యేకిస్తే విచారణ సులభతరమవుతుందని భావిస్తోంది. అయితే, ప్రస్తుతం ఏర్పాటైన ఒక కౌంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నందున దీనిని పెంచితే న్యాయం జరుగుతుందని బాధితులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, ఏలేరు అతిథిగృహంలో సోమవారం నుంచి నిర్వహిస్తున్న ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేకించి ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. సిట్ చైర్మన్ విజయకుమార్, ప్రతినిధులు వైవీ అనురాధ, భాస్కరరావు ఆధ్వర్యంలో సిట్ పరిధిలోకి వచ్చే ఫిర్యాదులను స్వీకరించడం, ఇప్పటి వరకు వచ్చిన వాటన్నింటినీ పరిశీలించే కార్యక్రమాన్ని చేపట్టారు. కేవలం టాంపరింగ్ జరిగిన వాటిపైనే దృష్టిపెట్టాలని సిట్ నిర్ణయించింది.
*చిత్రం...ఏలేరు అతిథిగృహంలో రికార్డులను పరిశీలిస్తున్న సిట్ ప్రతినిధి వైవీ అనురాధ