ఆంధ్రప్రదేశ్‌

అర్జీలన్నింటికీ త్వరలో పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో నేరుగా మంత్రులు పాల్గొని అర్జీలు స్వీకరించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
తూర్పు గోదావరి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నియమితులైన మోపిదేవి వెంకటరమణ సోమవారం జిల్లా పర్యటనకు వచ్చారు. అయనకు స్వాగతం పలకడానికి జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి బోస్, కన్నబాబు, పలువురు ఎమ్మెల్యేలు కాకినాడలోని ఆర్ అండ్ బీ అతిథిగృహం వద్దకు వచ్చారు. మోపిదేవి రాక ఆలస్యం కావడంతో సమీపంలోని కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి వీరంతా విచ్చేశారు. దీనితో అప్పటికే అర్జీలు స్వీకరిస్తున్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర్‌రెడ్డి సహా ఇతర ఉన్నతాధికారులు, అర్జీలివ్వడానికి వచ్చిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే తేరుకున్న అధికారులు ప్రజాప్రతినిధులకు కుర్చీలు ఏర్పాటుచేశారు. మంత్రులు బోస్, కన్నబాబు అధికారులతో కలిసి కొద్దిసేపు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రజల నుండి ఇళ్ల స్థలాలు, గృహాల మంజూరు, రేషన్ కార్డులు, పింఛన్ల కోసం అధిక సంఖ్యలో అర్జీలు వస్తున్నాయన్నారు. వీటిని పరిష్కరించాలని ప్రభుత్వానికి తెలియపరుస్తామని చెప్పారు. జిల్లాలోని గండేపల్లి మండలానికి చెందిన రైతుల వినతిపై స్పందించిన మంత్రులు 1200 ఎకరాలకు సంబంధించిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని వ్యవసాయ శాఖ జేడీ జెఎస్‌వి ప్రసాద్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి (కాకినాడ సిటీ), చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (రామచంద్రపురం), పెండెం దొరబాబు (పిఠాపురం) తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...వృద్ధుడి నుండి అర్జీ స్వీకరిస్తున్న మంత్రులు కన్నబాబు, సుభాష్‌చంద్రబోస్