ఆంధ్రప్రదేశ్‌

జగన్‌లా బాధ్యత మరిచి మాట్లాడను: పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), నవంబర్ 11: సీఎం జగన్‌లా తాను బాధ్యత మరిచి మాట్లాడలేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్ తనను అలా తిడుతుంటే తనకు కూడా బలంగా తిట్టే సత్తా ఉందని సోమవారం ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఇదీ మా సంస్కారం అంటూ గతంలో జగన్‌ను విమర్శిస్తూ తాను గతంలో మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌కు ట్యాగ్ చేశారు. కడపలో సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో 66 వేల తెలుగు పుస్తకాలు ఉన్నాయని, అప్పట్లో సీపీ బ్రౌన్ తెలుగు పరిరక్షణకు విశేష కృషి చేస్తే, ఇప్పటి పాలకులు తెలుగును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తీసుకువస్తున్న సందర్భంలో ప్రభుత్వంపై మీరు విరుచుకుపడలేదా అంటూ పవన్‌కళ్యాణ్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.