తెలంగాణ

సాగర తీరంలో భక్తజన సంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 12: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కృష్ణాజిల్లాలోని సాగర తీరాలు జనసంద్రంగా మారాయి. జిల్లా కేంద్రం మచిలీపట్నం శివారు మంగినపూడి బీచ్‌తో పాటు కృష్ణా నది సముద్రంలో కలిసే కోడూరు మండలం హంసలదీవి సాగర సంగమం భక్తులతో పోటెత్తాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత సమీపంలో ఉన్న మంగినపూడి బీచ్‌కు భక్తులు క్యూ కట్టారు. లక్షా 50వేల నుండి రెండు లక్షల మంది భక్తులు పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వేకువ జాము నుండి సాయంసంధ్యా సమయం వరకు సముద్ర స్నానాలు కొనసాగాయి.
*చిత్రం...మంగినపూడి తీరంలో భక్తుల సముద్రస్నానాలు