ఆంధ్రప్రదేశ్‌

ఇసుక మాఫియాలో అధికారపక్ష నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 12: రాష్ట్రంలో అధికార పక్ష నేతలు, మంత్రులు ఇసుక మాఫియాలో మునిగితేలుతున్నారని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో మంగళవారం గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించారు. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడటానికి ప్రభుత్వ విధానాలే కారణమని పేర్కొన్నారు. నిరుపేదల ఆకలి కేకలు తీర్చడానికి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 14వ తేదీన 12 గంటల దీక్షకు సిద్ధమవుతున్నారని తెలిపారు.
మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కల్సి రాష్ట్రంలో ఇసుక మాఫియా
రాజ్యమేలుతున్నదంటూ 7 మందితో కూడిన జాబితా అందజేశారు. ఇసుక కొరతని ప్రభుత్వమే సృష్టించిందని, వైసీపీ నేతల స్వార్థప్రయోజనాలు, అక్రమార్జన కోసం నిర్మాణ రంగాన్ని బలి చేసిందని దుయ్యబట్టారు. ఇసుక దొరక్క కార్మికులు రోడ్డునపడే దుస్థితిని మన రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. ఐదు నెలలుగా రాష్ట్రంలో ఇసుక కొరతపై భవన నిర్మాణ కార్మికులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఇసుక కృత్రిమ కొరతపై కుంభకర్ణుడిలా నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టిలేపడానికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 12 గంటల నిరసన దీక్ష చేపట్టారన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియాకు, ఇసుక కృత్రిమ కొరతకు, రాష్ట్రంలోని సహజవనరైన ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోవడానికి ప్రధాన కారకులు అధికార పార్టీ నేతలేనన్నారు. 16 నెలలు జైలు జీవితం గడిపిన ముఖ్యమంత్రి జగన్ తనకు తెలిసిన దోచుకుని, దాచుకునే విద్యను తన పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు నేర్పారన్నారు.
*చిత్రం...గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నేతలు