ఆంధ్రప్రదేశ్‌

గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 12: రాష్ట్రంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, ఐదు జిల్లాల పరిధిలో గుర్తించిన 554 గ్రామాలను ఏజెన్సీ ఏరియా పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర గిరిజన సలహా మండలి (టీఏసీ) సమావేశంలో తీర్మానించారు. అలాగే అటవీ ప్రాంతాల్లో ఇప్పటికే పోడుభూముల పట్టాలను పొందని గిరిజన రైతులకు రాబోయే ఉగాది పండుగకు లోపుగా పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అధ్యక్షతన మంగళవారం నాడిక్కడ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన టీఏసీ సమావేశంలో గిరిజన శాసనసభ్యులు, ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించి గిరిజన సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్సార్సీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారంగా ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్థానంలో ఎస్టీలకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలంటూ తీర్మానించారు. ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లును కూడా ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఆమోదించారు.
అలాగే రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన 39 మండలాల పరిధిలో 554 గ్రామాలు కొత్తగా ఏజెన్సీ ఏరియాలోకి చేర్చడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నాయని, వాటన్నింటినీ ఏజెన్సీ ప్రాంతాలుగా ప్రకటించాలని సిఫార్సు చేస్తూ మరో తీర్మానాన్ని కూడా టీఏసీ ఆమోదించింది. ఈ ప్రాంతాలన్నీ గతంలో సుమారు 35 ఏళ్ల క్రితం సర్వే చేసి ఏజెన్సీలోకి చేర్చడానికి అనువుగా ఉన్నాయని గుర్తించిన ప్రాంతాలేనని ఈ సందర్భంగా ఆమె వివరించారు. అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన రైతుల్లో 73 వేల మందికి ఇంకా ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు రావాల్సి ఉందనే అంశాన్ని కూడా చర్చించారు. అయితే అటవీశాఖ ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలివ్వడానికి సంబంధిత గిరిజన రైతులు 2005, డిసెంబర్ నాటికే ఆయా ప్రాంతాల్లో భూమిని సాగు చేస్తుండాలని నిబంధన విధించిన కారణంగానే ఎక్కువ మందికి పట్టాలు రాలేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలివ్వడానికి పెట్టిన చివరి తేదీని 2005 డిసెంబర్ నుంచి 2008 జనవరికి పొడిగించాలని టీఏసీ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ, సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ, అరకు ఎమ్మెల్యే పల్గుణ తదితరులు పలు అంశాలపై మాట్లాడారు.
ఈ నేపథ్యంలో బాక్సైట్‌తోపాటుగా అటవీ ప్రాంతాల్లోని ఇతర మైనింగ్ లీజులను కూడా రద్దు చేయాలని కోరారు. దీనిపై పుష్ప శ్రీవాణి స్పందిస్తూ గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు మైనింగ్ చేయకుండా చూడటం కోసం గతంలో ప్రత్యేకంగా ‘ట్రైబల్ మైనింగ్ కార్పొరేషన్ (ట్రైమ్‌కో) ఉండేదని, అయితే దాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. దాని పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ రంజిత్ భాషా, గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిసోడియా, ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు, టీసీఆర్ టీఐ డిప్యూటీ డైరెక్టర్ మందా రాణి, గురుకులం సంయుక్త కార్యదర్శి బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...గిరిజన సలహా మండలి సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి