ఆంధ్రప్రదేశ్‌

సీఎం చైర్మన్‌గా మిషన్ క్లీన్ కెనాల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణా, గోదావరి నదుల కాలువలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఉద్దేశించిన ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా-గోదావరి కెనాల్స్ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు ఉన్నాయి. అయితే ఈ నదులకు సంబంధించిన కాలువలు కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్నాయి. గతంలో కాలువలను శుభ్రం చేసేందుకు తీసుకున్న చర్యలు అంతగా ఫలితం ఇవ్వకపోవడంతో, భారీ స్థాయిలో మిషన్ తరహాలో చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు మిషన్‌ను ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మిషన్‌కు చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్‌గా చీఫ్ సెక్రటరీ, సభ్యులుగా పర్యావరణ నిపుణులు, జలవనరులు, పురపాలక శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శులు ఉంటారు. మెంబర్ సెక్రటరీగా మిషన్ డైరెక్టర్ వ్యవహరిస్తారు. కృష్ణా, గోదావరి నదుల డెల్టా వ్యవస్థలో కాలుష్యాన్ని నియంత్రించడం, ఈ నదులను ఆనుకుని ఉన్న పరిశ్రమల కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటుంది. ఇందుకు అవసరమైన చర్యలు మిషన్ చర్యలు తీసుకుంటుంది.