ఆంధ్రప్రదేశ్‌

పవన్.. తమాషా చేస్తున్నావా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 13: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని పుర పాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగపూర్ స్టార్టప్ కంపెనీలు, విద్యార్థులకు ఆంగ్ల బోధన, ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీతో కలసి పవన్ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు పవన్ ఆక్రోశం ఏమిటో తేల్చాలన్నారు. రాజకీయాల్లో సహనం ఉండాలని, నీకే నోరుందని రెచ్చిపోతే సహించేది లేదన్నారు. రాజకీయాల్లో విధానపరమైన ఆలోచనలు ఉండాలి.. అధికార భాష మీద పట్టు ఉండాలి.. ఇవేమీ లేకుండా తెలుగుభాషను విస్మరిస్తే మట్టికొట్టుకుపోతారు లాంటి వ్యాఖ్యలు చేయటం పవన్‌కు తగదన్నారు. టీడీపీతో చేతులు కలిపి తమాషా చేస్తున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులు పోటీని తట్టుకునేందుకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తప్పేంటని నిలదీశారు. పవన్ సంతానం ఎక్కడ చదువుతున్నారో తేల్చాలన్నారు. మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి.. పేద విద్యార్థులు నిరుద్యోగంతో అలమటించాలా అని ప్రశ్నించారు. మాతృభాషకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూనే ఆంగ్ల బోధన అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే దానిపై బురద జల్లుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు పవన్ వంతపాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు వెనక్కు మళ్లుతున్నాయని, రాజధాని స్టార్టప్ ఏరియా నుంచి సింగపూర్ తప్పుకుందని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు తన హయాంలో బీఆర్ శెట్టి, మరో సంస్థ పెట్టుబడులకు ఎందుకు వెనక్కు తగ్గిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఐదేళ్ల పాటు ఇసుక మాఫియాకు ఆజ్యం పోశారని ఇప్పుడు కొంగ జపాలు.. దొంగ దీక్షలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధానిలో 95 శాతం నిర్మాణాలు ఏ రకంగా జరిగాయో వివరించాలన్నారు. ఆయన పాలన సక్రమంగా ఉంటే ప్రజలు హీనంగా ఎందుకు తిరస్కరిస్తారని ప్రశ్నించారు. సింగపూర్ స్టార్టప్ ఏరియా నుంచి వైదొలగినా మిగిలిన ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడించిందన్నారు. పెట్టుబడులకు తగిన ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
*చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ