ఆంధ్రప్రదేశ్‌

యువతలో నైపుణ్యాభివృద్ధికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 13: యువతలో నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం కొత్తగా రూపొందించిన యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను వెలగపూడి సచివాలయంలో ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యువత భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశంలో 130 కోట్ల మంది జనాభాలో 60 కోట్ల మంది యువత ఉండటం విశేషమన్నారు. యువతలో నైపుణ్యాలు, సంస్కృతీ సంప్రదాయాలు, ఉపాధి, శిక్షణ సహా యువజనోత్సవాలను డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ నిర్వహిస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగా 18 అంశాల్లో పోటీలను నిర్వహిస్తామన్నారు. శాస్ర్తియ సంగీతం, జానపద సంగీతం, నృత్యం, సంగీత వాయిద్యాలు, మిమిక్రీ, ఏకపాత్రాభినయం తదితర అంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఆయా జిల్లాల సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ పోటీలు ఉంటాయన్నారు. సమైక్యతా కార్యక్రమాలను 5 రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. సమాజ సేవపై కూడా యువత దృష్టి సారించేలా చేస్తామన్నారు. యువజన పార్లమెంట్, ప్రకృతి వైపరీత్యాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై యువతకు శిక్షణ ఇస్తామన్నారు. మహిళా శక్తిని అభివృద్ధి చేసేందుకు వివిధ శాఖలతో సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్ సి.నాగరాణి, తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక హబ్‌గా ఏపీ
రాష్ట్రాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని సమావేశ మందిరంలో ఇనె్వస్టర్స్ అండ్ స్టాక్ హోల్డర్స్ మీట్ బుధవారం జరిగింది. పర్యాటకం ద్వారా రాష్ట్రానికి అధిక ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు ఉన్నాయని, పర్యాటక రంగానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. దీని వల్ల ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పెట్టుబడిదారులకు అవసరమైన విధానాలు సహా భద్రత, భరోసాను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు పెట్టుబడిదారులకు తలెత్తుతున్న ఇబ్బందులపై చర్చించి సమగ్ర విధానాన్ని తీసుకువస్తామని వెల్లడించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ వర్గాల సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. యునెస్కో హెరిటేజ్ సైట్స్‌లో ఏపీకి సంబంధించి ఏ వివరాలు నమోదు కాలేదన్నారు. దీనిపై తగిన శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ట్రైబల్ టూరిజం, అడ్వంచర్ టూరిజం, ఆధ్యాత్మిక టూరిజం, స్టోర్ట్సు సిటీ వంటివి ప్రోత్సహించేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించామన్నారు. వారి సూచనలను పరిగణలోకి తీసుకుని పర్యాటక హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. సముద్ర తీరం వెంబడి బీచ్‌ల అభివృద్ధి, కాటేజ్‌లు, రిసార్టులు వంటివి ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. నదుల వద్ద ఫిట్‌నెస్ కలిగిన బోట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, 8 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ శాఖల సమన్వయంతో పర్యాటక బోట్లు నడిపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుమలలో కేవలం దర్శనం కాకుండా ఇతర ప్రాంతాల సందర్శనకు టీటీడీతో ఒప్పందం చేసుకుంటామన్నారు. కడప, కర్నూలు, గండికోట, కళింగపట్నం, సూర్యలంక, వంటి ప్రాంతాల్లో హోటళ్లను ఏర్పాటు చేయనున్నామన్నారు.
యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు టూరిజం ఇంక్యుబేషన్, స్మోకీ వౌంటెన్, యోగా తత్పురుష వెల్‌నెస్ సెంటర్ వంటివి ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు.
*చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు