ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల జాబితా ప్రజల ముందు ఉంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 13: కొత్త సంవత్సరంలో తమ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటైన పరిశ్రమల జాబితాను ఆధారాలతో సహా ప్రజల ముందుకు ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన పరిశ్రమలు, ఐటి శాఖ అధికారులతో వేర్వేరుగా బుధవారం సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల సకాలంలో పూర్తి కాని పరిశ్రమలకు కొంత సమయం ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం సహకరిస్తే, చాలా మందికి ఉపాధి లభిస్తుందని గుర్తు చేశారు. రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి లభించిందన్న అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలకు నీటి కొరత సమస్యను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీఐఐసీకి అనుంబంధంగా ఐటి శాఖకు ప్రత్యేక లాండ్ బ్యాంక్ పోర్టల్ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామన్నారు. ఐటి శాఖ పరిధిలో ఉన్న మాన్యుఫాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ విభాగాలను విలీనం చేసే అంశం కూడా ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు. మీ-సేవా కేంద్రాలను గ్రామ సచివాలయాల్లో కలిపే అంశంపై కూడా ఐటి శాఖ సమీక్షలో చర్చ జరిగింది.
గ్రామ సచివాలయ ఉద్యోగులతో తమ ఉద్యోగాలు పోతాయని మీ-సేవ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మంత్రి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. వారి అనుభవం, ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకు చేర్చడం, సహకారం వంటి అంశాల్లో వారి నైపుణ్యాలను వినియోగించుకునే అంశంపై కూడా చర్చించారు. ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లి, మీ-సేవ ఉద్యోగుల ఆందోళన తొలగించేందుకు మార్గాలను అనే్వషించాలని అధికారులకు సూచించారు.