ఆంధ్రప్రదేశ్‌

స్పీకర్ స్థానాన్ని అవమానపర్చేలా వ్యాఖ్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 13: శాసన సభాపతి స్థానానికి అవమానం కలిగించేలా ముగ్గురు టీడీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్సీ నారా లోకేష్, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ చేసిన విమర్శలపై వారికి సభా హక్కుల నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం సచివాలయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలసి ఆయన మాట్లాడుతూ మీదీ ఓ బతుకేనా.. శాసనసభలో ఆంబోతు, దున్నపోతులా నిద్రపోతున్నావ్.. వాడు.. వీడు అంటూ అసభ్య పదజాలంతో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంను అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ దూషించారని, లోకేష్ లేఖల ద్వారా స్పీకర్ స్థానాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని వివరించారు. ఇందుకు వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేస్తామన్నారు.
సంక్షేమ పథకాల అమలులో ఏపీ రోల్‌మోడల్
ప్రతి బుధవారం ప్రభుత్వ, పార్టీ సమన్వయ సమావేశంలో అనేక అంశాలు చర్చించామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సహా 25 మంది ఎమ్మెల్యేలు హాజరైన ఈ సమావేశంలో జాతీయ ఉపాథి హామీ, సెర్ప్‌పై చర్చించినట్లు చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి నిధులు పక్కదారి పట్టాయని విమర్శించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా అవినీతి రహిత విధానాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రతిపక్షనేత అవసరమైనంత ఇసుక సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం రోజుకు లక్షా 25 వేల టన్నులు సరఫరా చేస్తున్నామని త్వరలో రెండు లక్షల టన్నులకు చేరుకుంటుందని తెలిపారు. ప్రజా మద్దతు, ప్రభుత్వ విధానాలను చూసి ఓర్వలేక చంద్రబాబు స్టంట్ చేస్తున్నారని మండిపడ్డారు.