ఆంధ్రప్రదేశ్‌

స్థానిక నేతల ఇష్టారాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 13: రాష్ట్రంలో రాజకీయ కలకలం రేపుతున్న ఇసుక సంక్షోభ నివారణకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యలకు కొందరు స్థానిక నేతలు అడ్డుపడుతున్నారు. అనుమతివున్న ర్యాంపుల్లో ఇసుక లభ్యతను పెంచడానికి అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు అమలుకానీయకుండా చక్రం తిప్పుతున్నారు. ఫలితంగా ఇసుక కొరత ఎక్కడ వేసిన గొంగళి చందంగా ఉంటోంది. వివరాల్లోకి వెళితే ఇసుక కొరత నేపథ్యంలో సాధ్యమైనంత మేర లభ్యత పెంచాలని స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశిస్తున్న సంగతి విదితమే. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదిపై ఉన్న పలు డీసీల్టేషన్ ర్యాంపుల్లో ఇసుక లభ్యతను పెంచడానికి అధికారులు చర్యలు చేపట్టారు. నావలపై నదిలోకి వెళ్లి, ఇసుకను తీసుకువచ్చే ర్యాంపులను డీసిల్టేషన్ ర్యాంపులు అంటారు. అనుమతివున్న ర్యాంపుల పరిధిలో అందుబాటులో ఉన్న ఇసుక ఆధారంగా నావల సంఖ్యను పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. ఫలితంగా రోజువారీ మరింత ఇసుక అందుబాటులోకి వస్తుంది. అయితే రాజమహేంద్రవరంలోని గోదావరి నదిపై ఉన్న కోటిలింగాలపేట-1 (కె-1) ర్యాంపులో మాత్రం అధికారులు కొత్తగా కొన్ని సొసైటీలకు చెందిన నావలకు అనుమతిచ్చినా, ఆ ర్యాంపు నిర్వహణలో చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేత ఒకరు అడ్డుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ర్యాంపులో నెలకొన్న వివాదాస్పద పరిస్థితుల నేపథ్యంలో కొన్ని రోజులు ర్యాంపును సబ్-కలెక్టర్ మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే గత ఐదారు రోజులుగా మళ్లీ ఈ ర్యాంపులో ఇసుక రవాణా ప్రారంభమయ్యింది. ఒక సొసైటీ పేరుతో సుమారు 35 నావలకు ఇసుక తవ్వడానికి ఇక్కడ అనుమతివుంది. ఇక్కడ మరో 15 నావల ద్వారా ఇసుక తీసే అవకాశంవుండటంతో ఎనిమిది సొసైటీలకు సంబంధించి 12 నావలకు తాజాగా రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ అనుమతిచ్చినట్టు తెలిసింది. అయితే ఈ ర్యాంపులోకి కొత్త సొసైటీలను రానిచ్చేది లేదని ప్రస్తుతమున్న సొసైటీకి అండగావున్న అధికార పార్టీ నేత అడ్డుకుంటున్నట్టు తెలిసింది. అంతేకాక ఈ ర్యాంపును ఆనుకునివున్న సమాధుల స్థలాన్ని కూడా ర్యాంపుగా మార్చి ఐదు నావల ద్వారా ఇసుకను తీస్తున్నట్టు తెలిసింది. 270 మీటర్ల విస్తీర్ణంలో ఉన్న కె-1 ర్యాంపులో ఒకే సొసైటీకి సంబంధించి 35 నావలకు అనుమతిచ్చారు. ఈ ర్యాంపులో ఇంకా అవకాశం వుంది కాబట్టి అధికారులు అదనపు నావలను కేటాయిస్తే స్థలం యజమాని చేత అడ్డు పెట్టిస్తున్నారని తెలుస్తోంది. రాజమహేంద్రవరంలో పెద్ద డీసిల్టేషన్ ర్యాంపుగావున్న గాయత్రి ర్యాంపు విస్తీర్ణం కేవలం 80 మీటర్లే అయితే అందులో 5 సొసైటీలకు సంబంధించి 40 నావలకు అనుమతి ఇచ్చారు. 270 మీటర్ల విస్తీర్ణంలోని కే-1 ర్యాంపులో మాత్రం ఒకే సొసైటీకి చెందిన 35 నావలకు మాత్రమే అనుమతివ్వడం గమనార్హం. కొత్తగా కేటాయించిన సొసైటీలకు అన్ని చోట్లా స్ధలాలు కేటాయించినప్పటికీ కే-1 ర్యాంపులో కొత్త సొసైటీలకు తావులేకుండా అధికార బలంతో చక్రం తిప్పుతున్నట్టు తెలిసింది. సీఎం దృష్టిసారించి, కొత్తగా నావలను అనుమతిస్తే మరింత ఇసుక లభ్యత పెరుగుతుందని అంటున్నారు.