ఆంధ్రప్రదేశ్‌

మరో 44 దేవస్థానాల పాలక మండళ్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 13: రాష్ట్రంలో మరో 44 దేవస్థానాల పాలక మండళ్లను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో దేవస్థానాల పాలక మండళ్ల రద్దు పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో 44 దేవస్థానాల పాలక మండళ్లను రద్దు చేసింది. గుడివాడ, మచిలీపట్నం, కృత్తివెన్ను, ఘంటసాల, తదితర ప్రాంతాల్లోని ఆలయాల పాలక మండళ్లను రద్దు చేసింది.
లక్ష్మీ పార్వతికి క్యాబినెట్ హోదా
ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతికి క్యాబినెట్ హోదా కల్పించారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు 14 వేల రూపాయల వేతనం, అలవెన్సుల కింద 15 వేల రూపాయలు, ఇంటి అద్దె కింద లక్ష రూపాయలు చెల్లిస్తారు.
మత్స్యకార దినోత్సవ నిర్వహణకు రూ. 1.07 కోట్లు మంజూరు
వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రకటించేందుకు వీలుగా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ ఉత్సవ నిర్వహణకు వీలుగా 1.07 కోట్ల రూపాయలను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.