ఆంధ్రప్రదేశ్‌

తెలుగును నిర్లక్ష్యం చేస్తే మట్టికొట్టుకుపోతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ): తెలుగు భాషను, సంస్కృతిని, ఉనికిని, చంపేసే ప్రయత్నాలు చేస్తే మీరంతా మట్టిలో కలిసిపోతారని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వం పెద్ద తప్పుచేసిందని, చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకోవాలన్నారు. విజయవాడలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశమంతా హిందీ మాట్లాడేలా చేయాలనుకున్న మోదీ, అమిత్‌షా లాంటి వ్యక్తులే తమిళనాడులో నిరసనలు ఉవ్వెత్తున వెల్లువెత్తినప్పుడు వెనక్కి తగ్గారని గుర్తు చేశారు. దేశాన్ని శాసించే స్థాయి వ్యక్తులే వెనక్కి తగ్గినప్పుడు మీరెంత అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా మేధావులు, భాషా పండితులు దీనిపై స్పందించాలన్నారు. భయపడుతున్న వారందరూ భయటకు వచ్చి వెంటనే స్పందించి తెలుగు భాష, సంస్కృతులను కాపాడాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో భాష, యాస, సంస్కృతులకు అవమానం జరిగిందని భావించినప్పుడు అక్కడ మేధావులు ఎలా అయితే బయటకు వచ్చారో అలాగే ఏపీలో కూడా అందరూ బయటకు రావాలని, లేకపోతే భావితరాలకు ద్రోహం చేసిన వారమవుతామన్నారు. నాయకుల మధ్య రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నా భాష విషయంలో ఐక్యత చాటుకోవాలన్నారు. కాని మన రాజకీయ నాయకులకు తెలుగుభాషపైనా, సంస్కృతిపైనా అస్సలు ప్రేమ లేదన్నారు. అందుకే ఏది మాట్లాడిన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులనే మళ్లీ వైసీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. మన సంస్కృతిని, మన భాషని చంపుకోవడం అంటే మన ఉనికిని చంపుకోవడమేనన్నారు. టీడీపీ చేసిన తప్పులను సరిదిద్దుతున్నాం అని ఒక పక్క చెబుతున్న వైసీపీ నేతలు తెలుగు భాష విషయంలో ఎందుకు వారు చేసిన తప్పుల్ని పునరావృతం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలుగు పేపర్లు నడుపుకుంటూ మీరు తెలుగుని నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఏమనుకోవాలన్నారు. ఇంగ్లీషు మీడియం చదువుకోవద్దు అని ఏవరూ అనడం లేదన్నారు. తెలుగు మాధ్యమంతో పాటు ఇంగ్లీషు మాధ్యమం కూడా ఉండాలన్నారు. తెలుగులో చదువుకునేందుకు ఒక్క విద్యార్థి ఉన్నా తెలుగు మాధ్యమ పాఠశాల కొనసాగించాలన్నారు. కాదు మా ఇష్టమొచ్చినట్లు చేస్తాం అంటే మాత్రం చూస్తూ ఉరుకోం అంటూ హెచ్చరించారు.
*చిత్రం...జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్