ఆంధ్రప్రదేశ్‌

10 రోజుల్లో సమస్యల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 13: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ టీసీఎల్ చిత్తూరు జిల్లాలో యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ఎదురవుతున్న వివిధ సమస్యలను 10 రోజుల్లో పరిష్కరిస్తామని ఆ సంస్థ ప్రతినిధులకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హామీ ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలో మంత్రిని టీసీఎల్ ప్రతినిధులు బుధవారం కలిసి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. టీవీ ప్యానెల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు టీసీఎల్ ముందుకు రావడం తెలిసిందే. ఆ సంస్థ ఎదుర్కొంటున్న విద్యుత్, నీరు, రవాణా తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలు పరిష్కరిస్తే వచ్చే ఏడాది నుంచి పనులు ప్రారంభించేందుకు సిద్ధమని తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, రవాణా, నీటి సరఫరా అంశాలను ఆయా శాఖల అధికారులతో చర్చిస్తానని తెలిపారు. ఈ నెల 18న పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారని, ఆ సమావేశంలో టీసీఎల్ సమస్యలు ప్రస్తావిస్తానని తెలిపారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. యూనిట్ ఏర్పాటుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అయితే 5 వేల మందికి ఉపాధి దొరుకుతుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
*చిత్రం...మంత్రి మేకపాటిని కలిసిన టీసీఎల్ ప్రతినిధులు