ఆంధ్రప్రదేశ్‌

తల్లిదండ్రుల అభీష్టం మేరకే ఆంగ్లం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 13: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాష మాధ్యమం ప్రవేశపెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహేతుకమైనదని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి స్పష్టం చేశారు. బుధవారం నెల్లూరులో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి ఆరవ తరగతి వరకు ఆంగ్లభాష మాధ్యమం ప్రవేశపెట్టడం సహేతుకమన్నారు. నేడు ప్రపంచమంతా ఓ కుగ్రామం అయిందని, గట్టి పోటీ వాతావరణం నెలకొందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రానురాను విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ నిర్వీర్యమైపోతోందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చేర్పించేందుకే ఆసక్తి చూపుతున్నారని, తల్లిదండ్రుల ఆశలు, ఆలోచనలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. అలాగని తెలుగు భాషను నిర్లక్ష్యం చేసేది లేదని, మాతృభాష తెలుగును గౌరవిస్తూనే ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందన్నారు. ఇతర దేశాల్లో ఉద్యోగం, వ్యాపార విషయాల్లో మనమే ఎక్కువగా ఉన్నామన్నారు. చైనాకన్నా మిన్నగా మనం ఆంగ్ల భాషపై శ్రద్ధ చూపుతున్నామన్నారు. ఒకప్పుడు చైనాలో చైనీస్ భాష మాట్లాడేవారని, నేడు వారు ఆంగ్లభాష ప్రాముఖ్యతను గుర్తించి ప్రాథమిక విద్య నుండి అన్ని తరగతుల్లో వారు ఆంగ్లభాష మాధ్యమం అమలు చేస్తున్నారన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు పొందాలంటే తప్పనిసరిగా ఆంగ్ల, హిందీ భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక విషయంపై వివరించాలంటే కమ్యూనికేషన్ నైపుణ్యం పొందాలంటే ఆంగ్లభాషకు అత్యధిక ప్రాధాన్యత ఉందన్నారు. తెలుగు భాషను తక్కువ చేయడం గాని, నిర్లక్ష్యం చేయడం గాని జరగదని స్పష్టం చేశారు. తెలుగుభాష మాతృభాష అని, దానిపట్ల మమకారం, గౌరవం ఎప్పుడూ తగ్గదన్నారు. లేనిపోని అపోహలు, అనుమానాలు పెంచుకోరాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 65 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారని, నేడు రాష్ట్రం విడిపోయాక అది 75 శాతానికి పెరిగిందన్నారు. ఇది ఒక హెచ్చరికలా ప్రతిఒక్కరూ భావించాల్సి ఉందన్నారు. కేవలం వ్యవసాయ రంగంపైనే వత్తిడి పెరగడం సరైనది కాదన్నారు. ప్రత్యామ్నాయంగా ఏదో ఒక పని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే ఉద్యోగాలు, ఉపాధి పొందేందుకు నైపుణ్యాలు నేర్పించడం ప్రభుత్వం ముందున్న సవాల్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారన్నారు. ఆంగ్లభాష ఉపాధ్యాయులను కొత్త రిక్రూట్‌మెంట్ ద్వారా నియమించుకుని ప్రభుత్వం మంచి దిశగా ముందుకు వెళ్తుందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అభినందనీయులని పేర్కొన్నారు.
*చిత్రం...శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి