ఆంధ్రప్రదేశ్‌

రెవెన్యూ పనులు చేయనీయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 25: భూ సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా తమ పనులు తాము చేసుకునే విధంగా ప్రభుత్వం సౌలభ్యం కల్పించాలని ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఇక్కడ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి తమపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని, ప్రతినెలా పింఛన్ల పంపిణీకి పది రోజుల సమయం పడుతోందని, రాజధాని భూ సేకరణ, భూ స్వీకరణ వంటి కార్యక్రమాలకు రెవెన్యూ ఉద్యోగులను ఉపయోగిస్తున్నారన్నారు. దీనివల్ల భూ సమస్యలు పరిష్కరించే సమయం లేక ప్రజల నుంచి విమర్శలు ఏదుర్కోవాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో ఆరు వేల మంది సర్వేయర్లు ఉండాల్సి ఉండగా, కేవలం 600 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. వీరు కూడా విమానాశ్రయాలు, రాజధాని నిర్మాణానికి భూసేకరణ, భూముల స్వీకరణ కార్యక్రమాల్లో ఉండిపోతున్నారన్నారు. ఇపుడు లైసెన్స్‌డ్ సర్వేయర్లను ప్రభుత్వం నియమించినందున శాశ్వతంగా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముందన్నారు. భూములు సబ్ డివిజన్లు చేయకుండా రిజిస్ట్రేషన్లు చేయరాదని, నిర్బంధ సబ్ డివిజన్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాల్సి ఉందన్నారు. పోలీసులకు మాదిరి తహశీల్దార్లకు కొత్తగా వాహనాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈసారి సాధారణ బదిలీలు ముందుగానే మొదలుపెట్టి 20 శాతంలోపు కౌనె్సలింగ్‌కు పరిమితం చేయాలన్నారు. గత ఏడాది సెప్టెంబర్, నవంబర్, జూన్, జనవరిల్లో బదిలీలు నిర్వహించారన్నారు. 600 మంది విఆర్‌ఓలను ఒకేసారి బదిలీ చేసిన పరిస్థితులున్నాయన్నారు. ఈ విధమైన అనేక సమస్యలపై ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం అందజేసామన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు సత్తి నాగేశ్వరరావురెడ్డి, రాష్ట్ర ప్రతినిధులు జనార్దనరావు, ఉత్తరాంధ్ర జిల్లాల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.