ఆంధ్రప్రదేశ్‌

అనంతలో హోదా నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 9: ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ అనంతపురం జిల్లాలో ప్రతిపక్షాలు, ఐక్యవిద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీలు, రాస్తారోకోలు, బైక్‌ర్యాలీలు నిర్వహించారు. అనంతపురం నగరంలో సిపిఐ, ఎఐఎస్‌ఎఫ్, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో టవర్‌క్లాక్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. అలాగే బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక హోదా కోసం నినాదాలు చేశారు. కాగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రత్యేక హోదా ప్రకటించేంత వరకు ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, వైకాపా విద్యార్థి సంఘం, ఎన్‌ఎస్‌యుఐ తదితర సంఘాల నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు.