ఆంధ్రప్రదేశ్‌

విభజనపై చర్చకు నోటీసివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన దగాపై చర్చించడానికి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వైసీపీ తరపున నోటీసు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. గతంలో ప్రధాని మోదీ, అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యల కేంద్రంగా చర్చించడానికి కృషిచేయాలని కోరినట్టు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ పార్టీని దోషిగా తూర్పారబడుతూ పార్లమెంట్ సాక్షిగా ప్రధాన మంత్రి మోదీ, హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలను కేంద్రంగా చేసుకుని వైఎస్సార్‌సీపీ ఎంపీలంతా పార్లమెంట్‌లో చర్చను లేవదీయాలన్నారు. ఈమేరకు ఎంపీలతో నోటీసు ఇవ్వాలని ఉండవల్లి సూచించారు. భారత పార్లమెంట్ చరిత్రలో చీకటి రోజు ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ విభజనేనని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించిన తర్వాత కూడా రాష్ట్ర నేతలుగా దానిపై చర్చించకపోవడం సరికాదన్నారు. నోటీసు ఇచ్చి రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా చర్చసాగడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, రెవెన్యూ పడిపోయిందని, మరోపక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవాలంటే రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రశ్నించాల్సిన అవసరం వుందన్నారు. తాను రాసిన లేఖకు జగన్ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం మంచిదేనని, అయితే తెలుగు భాష తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అధికార పక్షం చేసే తప్పులను ఎత్తిచూపడం అనేది ప్రతిపక్షాల బాధ్యత అని గుర్తించాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు తమ పాత్రను సమర్థవంతంగానే నిర్వహిస్తున్నాయన్నారు.
ఇసుక ధర అధికంగా వుందని, ఇక పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గతంలో ఇసుక ద్వారా
వచ్చే సొమ్ము రాజకీయ నాయకులకు చేరేదని, ప్రస్తుతం ప్రభుత్వానికి చేరుతుందనే అంశాన్ని ప్రజలకు వివరించాలని, అంతేగానీ ప్రతిపక్షాలపై దండెత్తడానికి చూడకూడదన్నారు. ఇప్పటివరకు జగన్మోహన్‌రెడ్డి అవినీతికి పాల్పడినట్టు గానీ, పాల్పడుతున్నట్టు గానీ ఆరోపణలు రాలేదని, అయితే అన్ని నియామకాల్లో తన మనుషులను నియమించుకున్నట్టుగా విమర్శలు వస్తున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మతం పేరుతో చిచ్చుపెట్టే పరిస్థితి మంచిది కాదని, మంచిని చెప్పే ఏ దేవుడైనా ఒక్కటేనన్నారు. అది ఇస్లాం అయినా, క్రైస్తవమైనా, హిందూ మతమైనా ఒకటేనన్నారు. సమావేశంలో అచ్యుతదేశాయ్, అల్లు బాబి, పసుపులేటి కృష్ణ, చెరుకూరి వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్