ఆంధ్రప్రదేశ్‌

పోటా పోటీ దీక్షలతో దద్దరిల్లిన బెజవాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), నవంబర్ 14: ఇసుక కొరతను ఒక వైపు టీటీపీ దీక్ష చేస్తుంటే, రాజకీయ లబ్ధికోసమే తెదేపా దీక్ష చేస్తోందంటూ మరోవైపు వైసీపీ దీక్షకు దిగడంతో విజయవాడలో సర్వత్రా ఉత్కంత నెలకొంది. ఇసుక కొరతను నిరసిస్తూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ధర్నా చౌక్ వద్ద 12 గంటల దీక్షను నిర్వహించారు. ఈ దీక్షకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు హాజరయ్యారు. చంద్రబాబు దీక్షకు పెద్ద ఎత్తున శ్రేణులు హాజరు కావడంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ధర్నాచౌక్ ప్రాంతంలో ట్రాఫిక్‌ను మళ్లించారు. అయితే చంద్రబాబు చేస్తున్న దీక్ష దొంగ దీక్ష అని ఆరోపిస్తూ వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి బందరురోడ్డులో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, మల్లాది విష్ణు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చంద్రబాబు దీక్ష శిబిరం వద్దకు వెళ్లేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద సిద్ధమయ్యారు. అయితే అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించారు. అయితే కొద్ది చేపు నిరసన వ్యక్తం చేసిన వైసీపీ నేతలు, అక్కడ నుండి సీపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సీపీకి వినతి పత్రం అందించారు. ఇదే సమయంలో ఎంతో రద్దీగా ఉంటే బందరురోడ్డుపై పెద్ద ఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.