ఆంధ్రప్రదేశ్‌

సినీ ప్రముఖుల తోడ్పాటుతో రాష్ట్భ్రావృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ (ఏపీ ఎఫ్‌డీసీ) చైర్మన్‌గా ప్రముఖ సినీ నటుడు టీఎస్ విజయ్‌చందర్ గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న సినీ ప్రముఖలు, ఆంధ్ర రాష్ట్ర ప్రముఖులు మాతృభూమి అభివృద్ధికి తోడ్పాటును అందించాలని, కన్న గడ్డ పిలుస్తోందని విజయ్‌చందర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనపై పెట్టిన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తిస్తానని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ఆర్టీసీ అడ్మినిస్ట్రేటివ్ భవన్‌లోని ఎఫ్‌డీసీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనల అనంతరం విజయ్‌చందర్ బాధ్యతలను స్వీకరించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ ఎండీ, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టీ విజయకుమార్ రెడ్డి, ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్‌లు పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం రాకముందు చదువుకునే రోజుల్లోనే కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరగానన్నారు. దివంగత రాజశేఖరరెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. వైఎస్‌ఆర్‌ని కలిసిన ప్రతిసారి ఆప్యాయతగా పిలిచేవారన్నారు. మడమ తిప్పని నాయకుడిగా జగన్‌మోహన్ రెడ్డి ఉన్నారని, రాష్ట్రంలో 151 సీట్లతో ప్రభంజనం సృష్టించారన్నారు. వైఎస్సార్ ఆత్మ అయిన జగన్ ద్వారా తన కల నెరవేరిందన్నారు. జగన్ సీఎం అయ్యాక మొదటిసారిగా రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ మాట్లాడుతూ సినీ రంగంలో విజయ్‌చందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితమే బయోపిక్స్‌లో నటించిన వ్యక్తి అని కొనియాడారు. ఎఫ్‌డీసీ ఎండీ, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ టీ విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ కరుణామయుడుగా, షిర్డీ సాయిబాబాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న విజయ్‌చందర్ తెలుగు ప్రజలందరికీ సుపరిచితమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ జనరల్ మేనేజర్ శేష సాయి, సీనియర్ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు.
*చిత్రం... ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడుతున్న విజయ్‌చందర్