ఆంధ్రప్రదేశ్‌

ఎవరు వెళ్లినా ఏమీ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), నవంబర్ 14: లక్షల మంది కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న తనపై చిల్లర రాజకీయాలు చేయాలని చూస్తారా అంటూ టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. విజయవాడ ధర్నా చౌక్‌లో 12 గంటల ఇసుక దీక్ష విరమణ సందర్భంగా గురువారం రాత్రి ఆయన మాట్లాడుతూ దీక్ష అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నంలో కుటిల రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇద్దరు నాయకులు పోతే వందలు, వేల నాయకులను తయారు చేసే సత్తా తెదేపాకు ఉందన్నారు. చెత్త రాజకీయాలు చేసిన వారిని చాలా మందిని చూశానన్నారు. గత ప్రభుత్వం పేదలకు ఎంతో ఉపయోగపడే పలు పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తే, ఇప్పటి ప్రభుత్వం వాటిని పక్కన పెట్టిందన్నారు. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లపై ఎందుకు మీకు అంత కోపం అని ప్రశ్నించారు. దురుద్దేశంతో పేదల పొట్టకొట్టారన్నారు. అన్న క్యాంటీన్లకు రంగులు మార్చి, వైఎస్ ఫోటోలు పెట్టి మరీ తాళాలు వేశారన్నారు. అసంఘటిత కార్మకులకు రక్షణ కవచంగా ఉన్న చంద్రన్న బీమాను కూడా అమలు చేయడం లేదన్నారు. ఈరోజు చంద్రన్న భీమా ఉంటి ఉంటే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకునే వీలుండేదన్నారు.
సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి
సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా ఉండాలనే అన్ని విధాలుగా ఆలోచించి, పక్కా ప్రణాళిక ప్రకారం రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని భావించే విశాఖ, తిరుపతి, అమరావతి అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే జగన్‌కు అమరావతిపై ఎందుకు అంత అక్కసో అర్థం కావడం లేదన్నారు. ఏ ప్రాంతానికో, వర్గానికో, మతానికో, కులానికో లబ్ధి చేకూర్చేందుకు అమరావతిని ఎంపిక చేయలేదన్నారు.
తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు?
తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్న సమయంలో సోనియాగాంధీ, అబ్దుల్ కలామ్ వంటి ప్రముఖులే డిక్లరేషన్ ఇచ్చినప్పుడు సీఎం జగన్ ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. తెదేపా పాలనలో ఎప్పుడైనా తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిందా అని ప్రశ్నించారు. ప్రజలను నమ్మించిన జగన్ ఇప్పుడు అన్యమతప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి
తెలుగు ఒక భాష మాత్రమే కాదు అన్న చంద్రబాబు సంస్కృతి, సంప్రదాయలకు ప్రతిబింబం అనే అంశం గుర్తుంచుకోవాలన్నారు. ఒక్కసారి పిచ్చి ఎక్కినట్లు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే ఎలా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు దీక్షను భవన నిర్మాణ కార్మికులు నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. బాబు దీక్షకు పలు పార్టీలు సంఘీభావం తెలపగా, రాష్ట్రం నలుమూలల నుండి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్‌ఛార్జ్‌లు, ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
*చిత్రం...చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేతున్న భవన నిర్మాణ కార్మికులు