ఆంధ్రప్రదేశ్‌

రైతులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులను ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కరవు పరిస్థితిపై శాసనమండలిలో శుక్రవారం జరిగిన స్వల్పవ్యవధి చర్చకు సమాధానం ఇస్తూ, కరవు పరిస్థితితో తరచూ పంటలకు నష్టం జరుగుతున్న ప్రాంతాల్లోని రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని వివరించారు. కడప, చిత్తూరు, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 271 మండలాల్లోని 4.90 లక్షల ఎకరాలకు రెయిన్‌గన్లద్వారా ఒక పర్యాయం నీటిని అందించామన్నారు. వేరుశనగ, కందులు, అపరాలు, పత్తి, మిరప, మొక్కజొన్న తదితర పంటలకు నీటిని అందించామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతో పాటు, వ్యవసాయ, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు కూడా పాల్గొన్నారన్నారు. చెరువులు, కాలువలు, బోర్‌వెల్స్, ట్యాంకుల్లో ఉన్న నీటిని ఇందుకోసం ఉపయోగించుకున్నామన్నారు. అలాగే కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలోని దాదాపు 18 వేల ఎకరాలకు రెండోపర్యాయం కూడా నీటితడిని అందించామన్నారు. రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 80 శాతం తడులకు రాయితీ ఇచ్చామని గుర్తు చేశారు. కరవు పరిస్థితి వల్ల ఒక్క ఎకరం పొలం కూడా ఎండిపోకూడదన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. దేశంలో రెయిన్‌గన్స్‌ద్వారా పంటలకు నీటిని అందించిన తొలిరాష్ట్రంగా ఎపి రికార్డు సృష్టించిందన్నారు. కరవుకు గురవుతున్న గ్రామాలను గుర్తించామని, ఈ గ్రామాల్లో పంటలకు నీటిని అందించేందుకు ఎన్ని రెయిన్‌గన్లు అవసరమో లెక్కకట్టామన్నారు.