ఆంధ్రప్రదేశ్‌

రాజీనామాకు నేను రెడీ.. లోకేష్ సిద్ధమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పట్టుపడుతున్నారని నేను రాజీనామా చేసేందుకు రెడీ.. మరి లోకేష్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవగలరా అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. శనివారం గన్నవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌పై తాను పరుష పదజాలాన్ని ప్రయోగించి ఉంటే క్షమాపణలు కోరతామన్నారు. అసలు చర్చను రాజేంద్రప్రసాద్ పక్కదారి పట్టించి తాను చంద్రబాబు కాళ్లు పట్టుకున్నట్లుగా విమర్శలు చేస్తున్నందునే తాను స్పందించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. పెద్దరికంగా చంద్రబాబుకు నమస్కారం చేశానని, పూజారులకు కూడా తాను అదే సంస్కారంతో నమస్కారం చేస్తానని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు కాళ్లకు మొక్కే వారంతా దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో అందరి మాదిరాగానే తన
నియోజకవర్గానికి పార్టీ నిధులు అందించారని చెప్పారు. అది తాను ఇల్లు కట్టుకోవటానికో..పొలం కొనుక్కునేందుకో వినియోగించ లేదన్నారు. అయ్యప్పమాల వేసుకుని దూషణలకు పాల్పడ్డట్టు ఆరోపణలు చేస్తున్నారని, తనపై తిట్ల దండకం చేసిన వారిపై స్పందించక పోతే ఎలా అని ప్రశ్నించారు. తాను తిరుమలలో వేయి కాళ్ల మండపాన్ని కూల్చలేదని, దుర్గమ్మ ఆలయంలో క్షుద్ర పూజలు చేయలేదని వ్యాఖ్యానించారు. టీటీడీ చైర్మన్, పాలకవర్గ పదవులను అమ్ముకోలేదని పరోక్షంగా టీడీపీ అధినేతను విమర్శించారు. లోకేష్‌ను తాను పప్పు అనలేదని గూగుల్ సెర్చ్‌లో అలా వస్తోందని, తనకంటే ముందు వాడెవడో వర్మ పప్పు అని సంబోధించారని చలనచిత్ర దర్శకుడు రాంగోల్ వర్మను ప్రస్తావించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం వైసీపీలో చేరితే తప్పేంటని ప్రశ్నించారు. తనపై రెండు కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. అవేమీ రాష్ట్రం వదిలి పారిపోయే ఓటుకు నోటు కేసు స్థాయివి కావన్నారు. ఇందిరాగాంధీ హత్య తరహా కేసులు అసలే కావన్నారు.

*చిత్రం... గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ