ఆంధ్రప్రదేశ్‌

ప్రతిపక్షాల దీక్ష ఖర్చుతో వెయ్యి కుటుంబాలు జీవిస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), నవంబర్ 16: ప్రతిపక్షాలు చేస్తున్న పలు దీక్షల ఖర్చుతో వెయ్యి కుటుంబాలు ఏడాది పాటు జీవిస్తాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజల మద్దతు లేకుండా దీక్షలు చేస్తున్నారని శనివారం ట్విట్టర్ వేదికగా విజయసాయరెడ్డి ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులకు నిజంగానే ఉపాధి పోయిందో లేదో తెలియదు కానీ, బాబుకు ఆయన భాగస్వామికి చేతినిండా పని దొరికిందని ఎద్దేవా చేశారు. రాంగ్ మార్చ్, ఒక్కపూట దీక్ష కోసం చేసిన ఖర్చుతో కనీసం 1000 కుటుంబాలు ఏడాది పాటు జీవిస్తాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు కీలకమైన స్థానాల్లో జనసేన డమీ అధ్యర్థులను బరిలో నిలిపిందన్న విషయాన్ని ఎమ్మెల్యే వంశీ వెల్లడించారని పేర్కొన్నారు. గన్నవరంలో సీపీఐ అభ్యర్థిని పవన్ పోటీకి దింపింది చంద్రబాబు ఆదేశాల మేరకే అని కూడా అంతపుర రహస్యాలను వంశీ బయటపెట్టాడన్నారు. అఖరికి జనసేన అభ్యర్థుల బీ ఫారాలు సైతం టీడీపీ ద్వారానే వెళ్లినట్లు తెలిసిందని వ్యాఖ్యానించారు.